అమిత్ షా పరువు కాపాడుతుందా

amit-shah
Spread the love

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా ముడుపులు అందాయంటూ వచ్చిన ఆరోపణలపై అమిత్‌ షా తనయుడు జరు అమిత్‌ నేరశిక్షాస్మృతి కింద పరువునష్టం దావా కేసు దాఖలు చేశారు. ‘ద వైర్‌’లో ఆదివారం ప్రచురితమైన కథనం నేపథ్యంలో ఆ వెబ్‌సైట్‌కు చెందిన ఏడుగురిపై రూ. 100 కోట్లకు పరువునష్టం కేసును నమోదుచేశారు. అహ్మదాబాద్‌ కోర్టులో కేసు దాఖలుచేయగా.. అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎస్‌కె గాధ్వీ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేశారు. కేసు నమోదైన వారిలో జరుపై కథనం రాసిన జర్నలిస్టు రోహిణీ సింగ్‌, వైర్‌ వ్యవస్థాపక ఎడిటర్లు సిద్ధార్థ వరదరాజన్‌, సిద్ధార్థ బాటియా తదితరులున్నారు.

అయితే ది వైర్ ప్రచురించి కథనం ఇప్పటికే పెను సంచలనం అవుతోంది. అధికార పార్టీని డిఫెన్స్ లో పడేసింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడి కొడుకే ఇలా అవినీతిలో కూరుకుపోయిన నేపథ్యంలో ఆత్మరక్షణ తప్పడం లేదు. వాస్తవానికి జే షాకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన బ్యాలెన్స్ షీట్ ను బహిరంగ పరిచి సవాల్ విసరవచ్చు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన పత్రాలను బయటపెట్టి తనలో లోపాలు లేవని చెప్పవచ్చు. కానీ దానికి భిన్నంగా పరిశోధనాత్మక పాత్రికేయులను బెదరించిడానికి చేస్తున్న ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందని చెప్పలేని స్థితి ఉంది.

దానికి కారణాలు కూడా లేకపోలేదు. ది వైర్ కథనం పక్కా ఆధారాలతో ఉంది. అంతేగాకుండా కథనాన్ని పరిశోధించి రాసిన రోహిణీ సింగ్ అధికారికంగానే అమిత్ షా తనయుడిని, ఆయన లాయర్ ని పదే పదే మెయిళ్ల ద్వారా స్పందించిన ఆధారాలున్నాయి. వారి స్పందన కూడా కథనంలో ఉంది. కాబట్టి పరువు నష్టం అనే ప్రశ్న ఉదయించడానికి ఆస్కారం లేదు. కానీ ది వైర్ ను కట్టడి చేయడం ద్వారా ఈ కథనాల ప్రభావం మరింత విస్తరించుకుండా, మరిన్ని పరిశోధనాత్మక వార్తలు రాకుండా అడ్డుకోవాలనే కుట్ర అధికార పార్టీ పెద్దలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ క్రమంలోనే తమ మీద బురదజల్లుతున్నట్టు ప్రజలకు చెప్పుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నారు. అడ్డంగా, సాక్ష్యాలతో దొరికిపోయిన తర్వాత చేస్తున్న ఈ ప్రయత్నాల ఫలితం ఆశించినట్టుగా ఉంటుందని మాత్రం చెప్పలేం.


Related News

SC Justices

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the loveసుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలోRead More

bhima-koregaon-latest

బరితెగించి దాడులు

Spread the loveదేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యంRead More

 • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
 • బీజేపీ ఎంపీకి జైలుశిక్ష
 • కోర్ట్ పై కాషాయ జెండా
 • మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
 • ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు
 • రాహుల్ సొంతగూటిలో కమల వికాసం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *