Main Menu

బాబు,సీబీఐ వ్య‌వ‌హారంలో జైట్లీ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యంపై ఆర్థిక మంత్రి స్పందించారు. ఏపీ ప్ర‌భుత్వం జీవో 176 ద్వారా సీబీఐపై ఆంక్ష‌లు పెట్టిన త‌ర్వాత ప‌లువురు కేంద్ర‌మంత్రులు నోరు మెదిపేందుకు సిద్ధ‌ప‌డ‌లేదు. ఎట్ట‌కేల‌కు ఆర్థిక‌మంత్రి జైట్లీ స్పందించ‌డం ఆస‌క్తిగా మారింది. అదే స‌మ‌యంలో ఆయ‌న చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి.

ఏదో జ‌రుగుతోంద‌ని చంద్ర‌బాబు భ‌య‌ప‌డిన‌ట్టు జైట్లీ వ్యాఖ్యానించారు. అలాంటి భ‌యాందోళ‌న‌తోనే సీబీఐని అడ్డుకోవాల‌ని చూస్తున్నారంటూ విమ‌ర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు అనుమతి ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన‌ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించడం లేదని ఆయన అన్నారు. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదని జైట్లీ స్పష్టం చేశారు.

దాంతో ఇప్పుడు జైట్లీ వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. అవినీతి విష‌యంలో ఎవ‌రికీ అధికారం లేద‌ని వ్యాఖ్యానించిన త‌ర్వాత కేంద్రం త‌దుపరి ఎలా స్పందిస్తుంద‌న్న‌ది చ‌ర్చకు దారితీస్తుంది.






Related News

మోడీకి మూఢిన‌ట్టేనా..!

Spread the loveప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రుRead More

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the loveసెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *