ఆంధ్రప్రదేశ్ ఆశలపై నీళ్లు జల్లిన మోడీ

JAITLEY-FEB-1
Spread the love

కేంద్రం బడ్జెట్ వచ్చింది. ఎన్నికల బడ్జెట్ కావడంతో ఎన్నో ఆశలు రేకెత్తించింది. ముఖ్యంగా కొత్త రాష్ట్రం కావడంతో ఆంధ్రప్రదేశ్ కి భారీ ప్రయోజనాలు దక్కుతాయని ఆశించారు. కానీ తీరా చూస్తే ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. ఆశల మీద నీళ్లు జల్లిన రీతిలో కనిపిస్తోంది. చంద్రబాబు పెద్ద చిట్టానే మోడీకి సమర్పించినా కనీసం మాట మాత్రం కూడా అమరావతి, పోలవరం, రైల్వేజోన్ వంటి కీలకాంశాలను విస్మరించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి అన్నిరకాలుగానూ నిరాశ కలిగించే బడ్జెట్ గా తాజా బడ్జెట్ కనిపిస్తోంది.

రాజధాని నగరం గురించి గానీ, ఏపీ ప్రజల జీవనాడి పోలవరం గురించి కూడా కనీసం ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కీలక సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం ఆందోళనకరంగా కనిపిస్తోంది. అదే సమయంలో రైతుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ మాటలకు ఆచరణకు పొంతనే కనిపించడం లేదు. కౌలురైతులకు రుణాలిస్తామని చెప్పిన మాటలు ఆచరణలో అమలయ్యే అవకాశాల మీద సందేహాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ నిధులు కేటాయించినప్పటికీ గడిచిన బడ్జెట్ కేటాయింపులకు, నిధుల విడుదలకు మధ్య ఉన్న వైరుధ్యం బడుగులను వెక్కిరించకమానదు.

ఇక మిగిలిన అంశాల విషయంలో ప్రధానంగా పన్ను పరిమితిం పెంచుతారని ఆశిస్తే దానికి భిన్నంగా కనిపించింది. మొబైల్ ధరలు పెరిగే అవకాశలు కనిపిస్తున్నాయి. కస్టమ్స్ డ్యూటీని పెంచడంతో ప్రభావం తప్పదు. అచ్చేదిన్ గురించి చెప్పిన మాటలు ఆచరణలో కనిపించవని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. గ్రామీణ భారతం, పేదరికం వంటి మాటలు చెప్పినా అంచనాలకు తగ్గట్టుగా కనిపించడం లేదు. మొత్తంగా కేంద్ర బడ్జెట్ అనేకమందిని నిరాశపరిచినట్టుగా చెప్పవచ్చు.


Related News

modi

మోడీకి మూడింది…!

Spread the loveబీజేపీలో కలకలం మొదలయ్యింది. కర్ణాటకలో తగిలిన షాక్ కమలాన్ని కకావికలం చేసేలా ఉంది. హస్తినలో బీజేపీ హెడ్Read More

7-BSY_0

ఎడ్యూరప్ప..ఇలా అయ్యిందేందప్పా..?

Spread the loveఅనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. కర్ణాటక రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినRead More

 • కర్ణాటకలో అలానే జరగాలి…!
 • బీజేపీ గెలిచింది: ‘ఫేక్‌ ‘ సర్వేలో..!
 • మోడీని నమ్మి మోసపోయా…!
 • బీజేపీకి భారంగా మారిన సీఎం
 • ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?
 • క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే
 • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
 • క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *