మోడీ నిర్ణయంపై భజ్జీ పంచ్

bhajji-1438327057-800
Spread the love

ఒకనాటి భారతీయ ఏస్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి గుగ్లీ వేశాడు. మోడీ సర్కారు నిర్ణయంపై గుర్రుగా కామెంట్ చేశాడు. దాంతో మోడీతో కాస్త సఖ్యంగా సాగిన ఈ క్రికెటర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమలు తీరు మీద భజ్జీ ట్వీట్ వైరల్ అయ్యింది. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటికీ నుంచీ రేట్లు తగ్గడం మాట అటుంచి.. ఏది ముట్టుకున్నా మండుతున్న విషయం తెలిసిందే. దాంతో ఈ వ్యవహారం అందరికీ మింగుడుపడని పరిస్థితిగా మారుతోంది.

సరిగ్గా ఇప్పుడు దాని ప్రభావం తన మీదకు రావడంతో హర్భజన్ సింగ్ కి కూడా చిర్రెత్తుకొచ్చింది. రెస్టారెంట్ బిల్లు పట్టుకోగానే కాలింది. అంతే ఒకేసారి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై పంచ్ వేశాడు. ఓ రెస్టారెంట్‌లో తినడానికి వెళ్లిన భజ్జీకి అక్కడి బిల్లు చూసి దిమ్మదిరిగింది. సెంట్రల్, స్టేట్ జీఎస్టీలు రెండూ కలిపి మోపెడయ్యింది. దీంతో తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. రెస్టారెంట్‌లో బిల్లు కడుతుంటే.. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్లు రెండూ మాతో డిన్నర్ చేసినట్లు అనిపించింది అని భజ్జీ ట్వీట్ చేశాడు.

దాంతో ట్విట్టర్ హర్బజన్ కామెంట్స్ మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. కేంద్రం, రాష్ట్రం కలిసి డిన్నర్ చేస్తున్నాయన్న కామెంట్స్ కాషాయ శ్రేణులకు కొరుకుడుపడకపోయినప్పటికీ పలువురు భజ్జీకి మద్ధతు పలకడం విశేషం.






Related News

SC Justices

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the loveసుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలోRead More

bhima-koregaon-latest

బరితెగించి దాడులు

Spread the loveదేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యంRead More

  • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
  • బీజేపీ ఎంపీకి జైలుశిక్ష
  • కోర్ట్ పై కాషాయ జెండా
  • మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!
  • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
  • మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
  • ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు
  • రాహుల్ సొంతగూటిలో కమల వికాసం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *