Main Menu

జ‌ర్న‌లిస్టుల ఫేస్ బుక్ అకౌంట్ల‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం

Spread the love

ఫేస్‌బుక్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల అకౌంట్ల‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. డజనుకు పైగా జర్నలిస్టుల అకౌంట్లను మాయం చేసేసింది. కనీసం ఎలాంటి హెచ్చరికలు లేదా నోటీసులు లేకుండా.. వారి అకౌంట్లను డిసేబుల్ చేయడం వివాదానికి దారితీస్తుంది. వీరిలో చాలా మంది సీనియర్‌ ఎడిటర్లే ఉండ‌డం విశేషంగా మారింది. అసలెందుకు ఫేస్‌బుక్‌ ఈ పని చేసిందన్న‌ది అంతుబ‌ట్ట‌డం లేదు. సీనియర్‌ ఎడిటర్ల అకౌంట్లనే ఎందుకు డిసేబుల్‌ చేస్తుందన్న‌ది ఆస‌క్తిగా మారింది.

అయితే ఈ జర్నలిస్టులలో ప‌లువురు వివిధ అంశాల‌పై తమ అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు పోస్టులు పెట్ట‌డ‌మే అకౌంట్ల డిసేబుల్ కావ‌డానికి కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. దేశంలో జరుగుతున్న కొన్ని కీలక అంశాలపై ఆర్టికల్స్‌ రాస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తుండ‌డంతోనే ఇలాంటి చ‌ర్య‌కు పూనుకున్న‌ట్టు భావిస్తున్నారు. ఎక్కువగా మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అట్టడగు వర్గాల వారి సమస్యలు, జాతీ ప్రాముఖ్యత అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆర్టికల్స్‌ రాస్తున్న వారి అకౌంట్ల‌నే డిజేబుల్ చేయ‌డం వెనుక ప్ర‌భుత్వ పెద్ద‌ల హ‌స్తం కూడా ఉంద‌ని అనుమానిస్తున్నారు. ప్ర‌జ‌లకు ప‌లు స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న క‌లిగిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించి ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

సెప్టెంబర్‌ చివరి వారంలో ఫేస్‌బుక్ ఈ ప్రముఖ జర్నలిస్ట్‌ల అకౌంట్లను డిసేబుల్‌ చేసింది. వారిలో దైనిక్‌ భాస్కర్‌ న్యూస్‌ ఎడిటర్‌ అజయ్‌ ప్రకాశ్‌, జంజ్వార్‌.కామ్‌ ఎడిటర్‌ ప్రేరణ నెగి, జనతాకారిపోర్టర్‌.కామ్‌ ఎడిటర్‌, బీబీసీ మాజీ ఎడిటర్‌ రిఫత్‌ జావిద్‌, గల్ఫ్‌లో అవార్డ్‌ విన్నింగ్‌ భారతీయ జర్నలిస్ట్‌, కాలమిస్ట్‌, ఖలీజ్‌ టైమ్స్‌ మాజీ ఒపీనియన్‌ ఎడిటర్‌ అజాజ్‌ జాకా సయ్యద్‌లు ఉన్నారు. అంతేకాక, జర్నలిస్ట్‌లపై వేటు వేయడాన్ని ఫేస్‌బుక్‌ ఇంకా ఆపలేదట. మరికొంతమంది ఎడిటర్లపై కూడా ఫేస్‌బుక్‌ వేటు వేయ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఫేస్ బుక్ చ‌ర్య‌ను ప‌లువురు ఖండిస్తున్నారు.

ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ మీడియాని చెప్పుచేత‌ల్లో పెట్టుకుని మీడియాలో వార్త‌ల‌ను నియంత్రిస్తున్న మోడీ, తాజాగా సోష‌ల్ మీడియాని కూడా కూడా నియంత్రించే ప్ర‌య‌త్నం చేయ‌డం, దానికి ఫేస్ బుక్ యాజ‌మాన్యం అంగీక‌రించ‌డం తీవ్ర అభ్యంత‌ర‌క‌ర‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యాన్ని జ‌ర్న‌లిస్టు ప్ర‌ముఖులు ట్విట్ట‌ర్ వంటి ఇత‌ర వేదిక‌ల ద్వారా ఫేస్ బుక్ చ‌ర్య‌ను నిర‌సిస్తున్నారు.






Related News

మోడీకి మూఢిన‌ట్టేనా..!

Spread the loveప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రుRead More

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the loveసెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *