Main Menu

ఎన్నిక‌ల షెడ్యూల్ కి ముహూర్తం ఫిక్స్

Spread the love

రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ఎన్నిక‌ల సంఘం ముహూర్తం సిద్ధం చేసింది. రాబోయే మార్చి మొద‌టి వారంలో షెడ్యూల్ విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగనుంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 3తో ముగియనుంది. ఎన్నికలను ఏయే తేదీల్లో ఎన్ని దశల్లో నిర్వహించాలనే అంశంపై ఈసీ తర్జనభర్జనలు సాగిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. భద్రతా దళాల లభ్యత, వాతావరణ పరిస్థితులు సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈసీ ఎన్నికల తేదీలను ఖరారు చేయనుంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసి మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తుందని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలనూ నిర్వహించవచ్చని ఈసీ వర్గాలు పేర్కొన్నారు. ఇక 2014లో మార్చి 5న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ ఏప్రిల్‌-మే నెలల్లో తొమ్మిది విడతలుగా పోలింగ్‌ నిర్వహించింది. ఏప్రిల్‌ 7న తొలివిడత పోలింగ్‌ చేపట్టిన ఈసీ మే 12న తుది విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియను ముగించింది.






Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *