Main Menu

ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం

Spread the love

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీల ప్ర‌చార హోరుకి బ్రేకులు వేసే ప్ర‌య‌త్నం చేయ‌బోతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా.. అన్ని ఫ్లాట్ ఫామ్స్ మీద ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్న పార్టీలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇకపై ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్‌కు 48 గంటల ముందు ఏ మాధ్యమంలోనూ ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం విధించాలని యోచిస్తోంది.

ఈ మేరకు న్యాయమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126 కింద ఉన్న నిబంధనలను విస్తరించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ చట్టం కింద కేవలం ఎలక్ట్రానిక్ మీడియాపై మాత్రమే నిషేధం ఉంది. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలను ప్రసారం చేయకూడదు. ఇప్పుడు దీనిని ప్రింట్, డిజిటల్ మీడియాకు కూడా అమలు చేయాలని లేఖలో కోరింది. దీనివల్ల ఓటర్లు తాము ఎవరికి ఓటెయ్యాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోగలుగుతారని ఈసీ అభిప్రాయపడింది.

మరోవైపు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియాకు కూడా ముకుతాడు వేయాలని ఈసీ యోచిస్తోంది. సామాజిక మాధ్యమాల విస్తృతి పెద్దది కావడంతో ఈసీకి కొన్ని తలనొప్పులు ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియాపైనా కఠిన నిబంధనలు విధించాలని చూస్తోంది. ప్రతికూల ప్రభావం చూపే వార్తలను ముందుగానే స్కానింగ్ చేయాలని నిర్ణయించింది. ఎన్నికలకు 48 గంటల ముందు రాజకీయ పార్టీల ప్రకటనలను బ్లాక్ చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా ఈసీ ఇప్పటికే ఫేస్‌బుక్‌ను కోరినట్టు తెలుస్తోంది.






Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *