కార్పోరేట్ బీజేపీ

bjp
Spread the love

కార్పొరేట్‌ సంస్థలు ఎప్పుడూ అధికార పార్టీ వైపు మెగ్గు చూపుతున్నాయన్న విషయం తెలిసిందే. వివిధ అవసరాల రీత్యా ఆయా సంస్థలు పాలకపార్టీలను మచ్చిక చేసుకుని పనులు చేయించుకుంటాయి. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కార్పోరేట్లు బీజేపీ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆపార్టీకి భారీగా నిధులు అందిస్తున్నారు. అనధికార వ్యవహారాలు పక్కన పెడితే అధికారికంగా గడిచిన మూడేళ్లలో అత్యధిక కార్పోరేట్ నిధులు సంపాదించిన పార్టీగా బీజేపీ నిలిచింది. దేశంలో అన్ని పార్టీలకు కలిపి 900 కోట్ల రూపాయలు నిధులుగా దక్కితే అందులో అత్యధిక భాగం రూ.705 కోట్లు బీజేపీకే దక్కడం గమనార్హం. అందులో సుమారు 150 కోట్లకు కనీసం పాన్ కార్డ్ కూడా లేని నిధులు కావడం విశేషం.

దాంతో ఈ వ్యవహారాల మీద పలువురు మండిపడుతున్నారు. బీజేపీ ప్రజల పేరు చెబుతూ కార్పోరేట్ల కోసం పనిచేసే పార్టీగా ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. పార్టీలకు ఇచ్చిన మొత్తం రూ.900 కోట్లలో అధిక భాగం బిజెపికే(రూ.705 కోట్లు) దక్కిందని, రెండో స్థానంలో కాంగ్రెస్‌(రూ.198 కోట్లు) ఉన్నట్టు వెల్లడైన విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు. కార్పొరేట్‌ సామాజిక నిధి(సీఎస్‌ఆర్‌) కోసం చట్టం తేవాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. ఆ నిధిని ప్రజాస్వామ్య నిధిగా భావించాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్‌ ద్వారా పార్టీలకు ఎన్నికల ఖర్చులు ఇవ్వాలని ఆయన అన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల్లో పెద్దమొత్తంలో ఖర్చు చేస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను నీరుగారుస్తున్నాయని ఏచూరి విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలు తాము కోరుకున్న పార్టీని అధికారంలోకి తేవడానికి పెట్టుబడులు పెడ్తూ, ఆ తర్వాత వాటిని రాబట్టుకుంటున్నాయని ఏచూరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా 15 రోజులపాటు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఏచూరి తెలిపారు.






Related News

modi

మోడీకి మూడింది…!

Spread the loveబీజేపీలో కలకలం మొదలయ్యింది. కర్ణాటకలో తగిలిన షాక్ కమలాన్ని కకావికలం చేసేలా ఉంది. హస్తినలో బీజేపీ హెడ్Read More

7-BSY_0

ఎడ్యూరప్ప..ఇలా అయ్యిందేందప్పా..?

Spread the loveఅనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. కర్ణాటక రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినRead More

  • కర్ణాటకలో అలానే జరగాలి…!
  • బీజేపీ గెలిచింది: ‘ఫేక్‌ ‘ సర్వేలో..!
  • మోడీని నమ్మి మోసపోయా…!
  • బీజేపీకి భారంగా మారిన సీఎం
  • ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?
  • క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే
  • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
  • క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *