మోడీ, షా ద్వ‌యానికి గుజ‌రాత్ లోనే షాక్..!

gujarath
Spread the love

దేశ‌మంతా మాదే అన్న‌ట్టుగా చెల‌రేగిపోతున్న గుజ‌రాతీ క‌మ‌ల ద్వ‌యం క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. సోనియా స‌ల‌హాదారుడికి చెక్ పెట్టాల‌ని చూసి చ‌తికిల‌ప‌డ్డారు. అత్యుత్సాహంతో అస‌లుకే ఎస‌రు వ‌చ్చింది. ఎన్ని ప‌న్నాగాలు ప‌న్నినా ఆఖ‌రికి కాంగ్రెస్ గ‌ట్టెక్కింది. అహ్మాద్ ప‌టేల్ మ‌రోసారి పెద్ద‌ల స‌భ‌లో అడుగుపెట్టే అవ‌కాశం రావ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

గుజరాత్‌లో మూడు రాజ్యసభ స్థానాల కోసం జరిగిన ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి వెల్లడైన ఫలితాల్లో బీజేపీ రెండు స్థానాల్లో నెగ్గగా, అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించారు. అహ్మద్ పటేల్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలాయి.
బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీలు నెగ్గగా, బల్వంత్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌ మాత్రం ఓటమి పాలయ్యారు. అమిత్‌షాకు 46 ఓట్లు, స్మృతీ ఇరానీకి 45 ఓట్లు, అహ్మద్ పటేల్‌కు మ్యాజిక్ ఫిగర్ అయిన 44 ఓట్లు పోలవ్వగా, బల్వంత్ సిన్హ్‌ రాజ్‌పుత్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు.

అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ చూపిస్తూ ఓటేయగా వివాదం మొదలైంది. కాంగ్రెస్ ఫిర్యాదుతో వీరిద్దరి ఓట్లను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించగానే లెక్కింపు ప్ర్రక్రియ మొదలైంది. దీంతో ఓట్ల సంఖ్య 174కు పడిపోయింది. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ బలం 51కి పడిపోగా.. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉండటంతో సంఖ్య 44 గా మారింది. ఈ ఓట్లన్నీ సొంతం చేసుకోవడంతో అహ్మద్ పటేల్ ఐదోసారి ఎన్నికైనట్లయింది.

దాంతో ఈ ఫ‌లితాలు గుజ‌రాత్ కాంగ్రెస్ కి కొంత ఉత్సాహాన్ని నిల‌బెట్టాయి. అహ్మాద్ ప‌టే ల్ కూడా ఓట‌మి పాల‌యితే కాంగ్రెస్ పునాదుల‌కే పెనుప్ర‌మాదం పొంచి ఉన్న త‌రుణంలో ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌మ ఓట్ల‌ను అమిత్ షా కి చూపించ‌డం, అది కాస్తా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావ‌డంతో క‌మ‌ల‌నాధుల కోరిక నెర‌వేర‌లేదు.


Related News

niramodi-k5lG--621x414@LiveMint

నీర‌వ్ మోడీ బీజేపీకి పార్ట‌న‌ర్

Spread the love1Shareపంజాబ్ నేష‌నల్ బ్యాంక్ ని ముంచి, దేశం నుంచి ద‌ర్జాగా పారిపోయిన నీర‌వ్ మోడీ వ్య‌వ‌హారం క‌ల‌క‌లంRead More

priya-keralacm-1518744653

ఆ పాటకు మద్ధతుగా సీఎం

Spread the love2Sharesకేరళ సీఎం మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన సినిమా పాటకు మద్దతుగా నిలిచారు. ఇటీవల బాగా పాపులర్Read More

 • సీఎం ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం
 • మాజీ సీఎం కులం మార్చేసిన మోడీ
 • మోదీ మత్తులో ఉన్నప్పుడు…
 • ఆంధ్రప్రదేశ్ ఆశలపై నీళ్లు జల్లిన మోడీ
 • ఆ సీఎం ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు…
 • దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు
 • బరితెగించి దాడులు
 • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *