మోదీ మత్తులో ఉన్నప్పుడు…

news-28-ramya-congress
Spread the love

కాంగ్రెస్ ఐటీ విభాగం ఇన్చార్జ్ , మాజీ ఎంపీ , సినీ నటి రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని మోడీ గురించి ఆమె వ్యక్తిగతంగా చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. బెంగళూరు ర్యాలీలో మోడీ చేసిన ‘టాప్’ వ్యాఖ్యలపై రమ్య కౌంటర్ దుమారం రేపుతోంది. రైతులే తనకు ‘టాప్’ (టి-టమోటా, ఒ-ఆనియన్, పి-పొటాటో) ప్రాధాన్యమని మోడీ పేర్కొన్నారు.

మోడీ వ్యాఖ్యలకు స్పందనగా రమ్య ట్వీట్ చేస్తూ ‘మీరు ‘పాట్'(మత్తు)లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుందన్నమాట’ అంటూ ఇచ్చిన ఘాటు కౌంటర్ కలకలం రేపుతోంది. రమ్య ట్వీట్‌పై బీజేపీ , మోడీ అబిమానులు తీవ్రంగా మండిపడ్డారు. దాంతో సర్థుకున్న రమ్య సవరణగా మరో ట్వీట్ చేశారు. పాట్ అంటే ‘పొటాటోస్, ఆనియన్స్, టమోటాస్’ అని ఎందుకు అనుకోకూడదంటూ తనను తాను సమర్థించుకున్నారు.

అయితే బీజేపీ నేతలు మాత్రం ‘డ్రగ్స్ మత్తు’ అన్న ఉద్దేశంతోనే రమ్య ట్వీట్స్ ఉన్నాయని మండిపడుతున్నారు. దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమ్యపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక సీఎం కూడా దానిపై స్పందించారు. వ్యక్తిగత విమర్శలు వద్దంటూ సూచించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *