హోదా ఉద్యమాన్ని కొత్తమలుపు తిప్పిన కాంగ్రెస్

కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీని ఇరకాటంలో నెట్టడానికి కదులుతోంది. అందులో భాగంగా ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో ముందుకు వచ్చిన అవిశ్వాసాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగానే వారం రోజులుగా పార్లమెంట్ లో నానుతున్న అవిశ్వాసం విషయంలో కొత్త అడుగు వేసింది. తామే అవిశ్వాసం పెట్టబోతున్నట్టు ప్రకటించింది. 27నాడు అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం పెట్టినట్టు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతల ప్రకటించారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారబోతోంది. ప్రధాన ప్రతిపక్షం ముందుకు రావడంతో అవిశ్వాసం మీద చర్చ ఖాయంగా మారింది. వచ్చే మంగళవారం నాడు అవిశ్వాసం పార్లమెంట్ ముందుకు రావచ్చని భావిస్తున్నారు.
ఇప్పటికే అవిశ్వాసం విషయంలో తొలుత వైసీపీ, దానిని అనుసరించి టీడీపీ నోటీసులు జారీ చేస్తున్నాయి. ప్రతీ రోజూ నోటీసు ఇవ్వడం, పార్లమెంట్ లో సభ ఆర్డర్ లో లేదు కాబట్టి, చర్చకు ఆస్కారం లేదని, కనీసం ఎంపీలను కూడా లెక్కగట్టలేకపోతున్నామని స్పీకర్ చెబుతున్నారు. దాంతో అవిశ్వాసం పెద్ద చిక్కుముడిగా మారిపోయింది. చర్చ సాగుతున్న దాఖలాలే లేకపోవడంతో సభ పూర్తిగా స్తంభించిపోతోంది. కనీసం స్పీకర్ గానీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగానీ పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో సమస్య తీవ్రం అవుతోంది.
ఈనేపథ్యంలో కాంగ్రెస్ ఎంట్రీ అవుతోంది. అవిశ్వాసానికి తానే సిద్దం అవుతోంది. దాంతో ఇన్నాళ్లుగా మిత్రపక్షంగా ఉన్న టీడీపీ బయటకు వచ్చి అవిశ్వాసం పెడితే కష్టంగా భావించిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ అవిశ్వాసానికి కూడా సై అంటున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ తరుపున పలువురు నేతలు చర్చలో పాల్గొనడానికి సన్నద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీకి చేసిన ప్రయోజనాల గురించి ఏకరువు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా టీడీపీని ఇరకాటంలో నెట్టే యోచనలో బీజేపీ పెద్దలున్నారని భావిస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీ సహా ఇతర పక్షాలు కూడా బీజేపీ వైఖరిని, టీడీపీ తీరును తప్పుబట్టే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారంలో నేపథ్యంలో కాంగ్రెస్ అడుగులు ఆసక్తి రేపుతున్నాయి.
Related News

ఏటీఎం కష్టాలకి అసలు కారణం అదేనా?
Spread the loveమళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 50 రోజులు ఆగండి..ఆ తర్వాత ఉరితీసినా ఫర్వాలేదని ధీమా వ్యక్తం చేసిన ప్రధానRead More

కర్ణాటక ఎన్నికలపై ఆసక్తికర సర్వే
Spread the loveకర్ణాటక ఎన్నికలు దేశమంతా ఆసక్తిరేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాసులు చాలామంది కర్ణాటక ఫలితాలను గమనిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్Read More