Main Menu

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the love

సుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సిబిఐ న్యాయమూర్తి బిహెచ్‌ లోయా మృతి కేసుతోపాటు, మెడికల్‌ స్కాం కేసునూ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

లోయా మృతి కేసు…
న్యాయమూర్తి లోయా మరణంపై దర్యాప్తు జరపాలో వద్దో నిర్ణయించాల్సిన అంశాన్ని ధర్మాసనానికి వదిలివేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాపై 2014లో సోహ్రబుద్దీన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసు విచారిస్తున్న సమయంలోనే న్యాయమూర్తి లోయా అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంవెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం ఉందన్న అనుమానాలు వచ్చాయి.

– న్యాయమూర్తి లోయా గుండెపోటుతో మరణించినట్లు వైద్య రికార్డులు చెబుతున్నాయి. సోహ్రబుద్దీన్‌ కేసులో అమిత్‌షాకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తే రు.100 కోట్లు లంచం ఇస్తామని ఆయనకు ఆఫర్‌ వచ్చినట్లు లోయా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

– లోయా మరణించిన రెండు వారాల తరువాత నియమితులైన కొత్త న్యాయమూర్తి సోహ్రబుద్దీన్‌ కేసులో అమిత్‌షాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు.

– లోయా మృతిపై ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న సందేహాలను కొట్టిపారేస్తున్న అధికారులు ఆయన సజీవంగా వున్నపుడు ఆయన వద్ద వైద్యులు వున్నారని గుర్తుచేస్తున్నారు. అయితే లోయా మృతిని కప్పిపుచ్చేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సంకేతాలు తనక్కెడా కన్పించలేదని అక్కడే వున్న మరో న్యాయమూర్తి భూషణ్‌ గవారు చెప్పారు. లోయాను ఎటువంటి రక్షణా లేకుండా ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించారంటూ కుటుంబ సభ్యులు చేస్తున్న వాదనను ఆయన ఖండించారు. గుండెపోటు వచ్చిన వెంటనే లోయాను కోర్టు అధికారి సాయంతో ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.

ధర్మాసనానికి కేసు బదిలీ
న్యాయమూర్తి లోయా మృతి కేసు విచారణ బాధ్యతను ప్రత్యేక ధర్మాస నానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో సభ్యులైన న్యాయమూర్తుల్లో ‘రెబల్స్‌’ ఎవరూ లేకపోవటం గమనార్హం.

మెడికల్‌ స్కాం కేసు
2017 ఆగస్టులో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధిం చిన కేసు ఒక ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి అనేక పర్యాయాలు బదిలీ అవుతూ వెళ్లింది. సుప్రీంకోర్టులో మెడికల్‌ కాలేజీలకు అనుగుణంగా ఉత్తర్వులిప్పిస్తామనే హామీతో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలతో ఒడిషా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరిని గతేడాది సెప్టెంబర్‌ 23న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ‘మెడికల్‌ కాలేజీల కుంభకోణం’గా పేర్కొంటున్న సదరు కేసు గతేడాది నవంబర్‌లో జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది.

ఈ కేసులో దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ చలమేశ్వర్‌ సమర్థించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఐదుగురు న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేసి కేసును బదిలీ చేశారు. సుప్రీం ధర్మాసనం ఒక ఉత్తర్వు జారీ చేస్తూ, ‘ఈ మొత్తం పరిస్థితులన్నిటిని బట్టి చూస్తే, ఈ అంశాన్ని తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనమే సరైన వేదిక, అందుకే దీనిని ఈ కోర్టుకు చెందిన మొదటి అయిదుగురు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తున్నామని తెలిపింది. ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగినది అయినందున దీనిని సోమవారం (అది 2017 నవంబరు13)న విచారణకు వచ్చేలా లిస్టులో చేర్చామని పేర్కొంది. ఈ కేసుపై విచారణ కొనసాగుతున్న సమయంలో చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా జారీ చేసిన ‘అభిప్రాయం’ను అఫీసియల్‌ రిజిస్ట్రీ ధర్మాసనం ముందుంచడం, ఆ ప్రకారమే విచారణ సాగిన వైనాన్ని గురించి కూడా ఆ ఉత్తర్వులో ధర్మాసనం ప్రస్తావించింది. మెడికల్‌ స్కామ్‌ కేసును చీఫ్‌ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్నందున, రాజ్యాంగ ధర్మాసనంలో ఆయనను (చీఫ్‌ జస్టిస్‌ను) చేర్చవద్దంటూ దావా చేసిన అభ్యర్థనపై కోర్టు మొదట ఏమీ మాట్లాడలేదు. ఒక గంట తరువాత జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ అంశాన్ని మధ్యాహ్నం 12.45 గంటలకు విచారించనున్నట్లు తెలిపింది. చీఫ్‌ జస్టిస్‌ మిశ్రా ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను పది నిమిషాలపాటు వాయిదా వేసింది. ఆ తరువాత 2 గంటలకు విచారణ పునరుద్ధరించబడుతుందని కోర్టు హాలులో వున్న న్యాయవాదులకు సమాచారమిచ్చారు. బుధవారం మధ్యాహ్న భోజన విరామం తరువాతి సెషన్‌లో తాను విచారించాల్సిన ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని మరో ధర్మాసనానికి నివేదించినట్లు జస్టిస్‌ చలమేశ్వర్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ గురించి దావే మాట్లాడుతూ, అత్యున్నత న్యాయస్థానం ముందున్న ఈ కేసులో తీర్పును ప్రభావితం చేసేందుకు కొందరు ఆన్యాయంగా, అనుచితంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదొక సంకేతమన్నారు.


Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *