Main Menu

రాహుల్ సొంతగూటిలో కమల వికాసం

rahul-gandhi-will-be-visiti
Spread the love

ఏఐసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న వేళ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. ఆయన సొంత గూటిలో కాంగ్రెస్ పరాజయం పాలయ్యింది. దాంతో బీజేపీ విజయం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడడం లేదు. అందులోనూ అమేథీలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయిన కాంగ్రెస్ , ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా ఓటమి పాలుకావడం విశేషంగా మారింది.

రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి నగర పంచాయితీలో బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. వేయికి పైగా ఓట్ల తేడాతో బీజేపీ అమేథిలో గెలుపొందింది.
ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆ పార్టీ కోల్పోయింది. అమేథితో పాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌ బరేలీలోనూ బీజేపీ స్ధానిక పోరులో ఘనవిజయం సాధించింది. అమేథి నగర్‌ పంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యూపీ స్ధానిక ఎన్నికల్లో అత్యధిక మేయర్‌ స్ధానాలను, నగర పంచాయితీలను బీజేపీ కైవసం చేసుకుంది.






Related News

rammadhav

మోడీకి భ‌క్తుడు రాంరాం..

Spread the loveబిజెపికి కీల‌క నేత దూర‌మ‌య్యారు. ఆయ‌న జ‌నంలో ఉండే నాయ‌కుడు కాక‌పోయినా, జ‌నం నాడి క‌నిపెట్టి, బీజేపీRead More

625352-modi-narendra-pti-092217

ముహూర్తం పెట్టేస్తున్న మోడీ

Spread the loveఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా మేం సిద్దం అంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. కేంద్రంలో పెద్ద‌లు కూడా అదే ఆలోచ‌న‌లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *