శబరిమలలో బీజేపీకి ఎదురుదెబ్బ

కేరళలో బీజేపీ జోరు పెంచింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పును సాకుగా చూపించి ఉద్యమాల వేడి రాజేస్తోంది. వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ అగ్రనేతలు సైతం రంగంలో దిగారు. చివరకు ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి కూడా వెనకాడమని అమిత్ షా ప్రకటించారు. అయినా కాషాయ శ్రేణులకు మలబారు తీరం మింగుడుపడడం లేదు. తాజా ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా తగిన ఫలితాలు రాకపోవడంతో కాషాయ శిబిరంలో నిరాశ అలముకునేలా కనిపిస్తోంది.
కేరళలోని 14 జిల్లాల పరిధిలో స్థానిక సంఘాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 39 సీట్లకు ఎన్నికలు జరగ్గా వాటిలో 21 సీట్లను పాలకపక్ష ఎల్డీఎఫ్ గెలుచుకోగా, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 12 సీట్లను గెలుచుకొంది. ఇక బీజేపీకి రెండు సీట్లు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ)కు రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు రెండు సీట్లు వచ్చాయి.
చివరకు శబరిమల ఆలయం ఉన్న పట్టణంమిట్ట జిల్లాలోని రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని భావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా బీజేపీ, ఆరెస్సెస్ వర్గాలు భారీ నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. అయినప్పటికీ ఈ రెండు సీట్లలో ఒక సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించగా, మరో సీటును ఎస్డీపీఐ అభ్యర్థి గెలుచుకున్నారు. అలప్పూజ జిల్లాలో మాత్రమే రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. దాంతో కేరళ తీరంలో కమ్యూనిస్టుల హవా కొనసాగగా, కాషాయం వెలవెలబోయిందని చెప్పవచ్చు.
Related News

బాప్-భేటా అవినీతికి ముగింపు తప్పదు..!
Spread the loveఏపీలో అత్యంత చర్చనీయాంశంగా మారిన నరేంద్ర మోడీ పర్యటన ఆసక్తిగా సాగింది. అనుకున్నట్టుగానే మోడీ చంద్రబాబు మీదRead More

మోడీ మీన ఎక్కువ ఆశలు పెట్టుకోమాకు..!
Spread the loveమళ్లీ వత్తున్నాడు గానీ మనకు ఏటో చేత్తాడనుకోకు. అతడొత్తాడు..వెళతాడంతే. మన ఆంధ్రప్రదేశ్ లో ఆయన మాట ఏమీRead More