బీజేపీలో తిరుగుబాటు: మోడీ మీద గురి!

bjp mp
Spread the love

బీజేపీ ఎంపీ తిరుగుబాటు చేశారు. పార్టీ తీరుపై తీవ్రంగా మండిప‌డ్డారు. బీజేపీలో అట్ట‌డుగు వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రుగుతోందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రిజ‌ర్వేష‌న్లు ఎత్తేయ‌డానికి కుట్ర జ‌రుగుతోందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దాంతో ఉత్త‌ర ప్రదేశ్ కి చెందిన ఎంపీ సావిత్రి బాయి ఫూలే వ్యాఖ్య‌లు బీజేపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. అధికార పార్టీలో అల‌జ‌డి సృష్టి స్తున్నాయి. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా ఆమె ఏకంగా ఏప్రిల్ 1నాడు ల‌క్నోలో భారీ ర్యాలీ కి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎస్సీ, ఎస్టీల హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ ప‌రిణామాలు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఇటీవ‌ల యూపీ ఉప ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొన్న బీజేపీకి తాజా ప‌రిణామాలు మింగుడుప‌డే అవ‌కాశం లేదు.

బీజేపీకి చెందిన ఎంపీ బీజేపీ మీద చేసిన వ్యాఖ్య‌లు విప‌క్షాల‌కు పెద్ద అస్త్రంగా మారబోతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బెహ్రయిచ్ ఎంపీ సీటు నుంచి ఆమె తొలిసారిగా ఎంపిక‌య్యారు. ఎస్పీ అభ్య‌ర్థిని 90వేల ఓట్ల తేడాతో ఓడించి పార్ల‌మెంట్ లో అడుగుపెట్టారు. అయితే తాజాగా బీజేపీలో రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్చ సాగుతోందంటూ సాధ్వీ సావిత్రిబాయి ఫూలే ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సొంత పార్టీపైనే మ‌హిళా ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను తొలగించేందుకు పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. రిజర్వేషన్ల అంతానికి కుట్ర జరుగుతున్నా, ప్రభుత్వం మౌన ప్రేక్షకుడి మాదిరిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను సమీక్షించాలంటూ బీజేపీలో నిరంతరం చర్చ జరుగుతోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాంతో ఆమె వ్య‌వ‌హారం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

బీజేపీలో మోడీకి వ్య‌తిరేకంగా సాగుతున్న వ్య‌వ‌హారాల‌కు ఆమె వ్యాఖ్య‌లు ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. అవిశ్వాసం పార్ల‌మెంట్ లో చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకోవ‌డానికి ఇలాంటి అనేక కార‌ణాలున్నాయ‌ని చెబుతున్నారు. సావిత్రి స‌హా ప‌లువురు ఉత్త‌రాది ఎంపీలు, వివిధ అసమ్మ‌తి వ‌ర్గాలు మోడీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు భావిస్తున్నారు. దానిలో భాగంగానే సావిత్రి తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌త్యంలో 18శాతం ద‌ళితులున్న రాష్ట్రంలో రిజ‌ర్వేష‌న్ల మీద ఆమె చేసిన వ్యాఖ్య‌లు బీజేపీకి తీర‌ని నష్టం చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. ఏమ‌యినా బీజేపీలో మారుతున్న ప‌రిణామాలు మోడీకి చెమ‌ట‌లు ప‌ట్టించేలా మార‌తాయ‌నే అభిప్రాయం అక్క‌డ‌క్క‌డా వ్య‌క్తం అవుతోంది.« (Previous News)Related News

atm-1495008331

ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?

Spread the loveమ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 50 రోజులు ఆగండి..ఆ త‌ర్వాత ఉరితీసినా ఫ‌ర్వాలేద‌ని ధీమా వ్య‌క్తం చేసిన ప్ర‌ధానRead More

karnataka-elections-illustration-759

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌మంతా ఆస‌క్తిరేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాసులు చాలామంది క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్Read More

 • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
 • క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ
 • బీజేపీలో తిరుగుబాటు: మోడీ మీద గురి!
 • అడ్డంగా బుక్కయిన అమిత్ షా
 • సర్వే: మోడీకి మరో గండం
 • హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్
 • బీజేపీ ఆశ‌ల‌కు గండి..!
 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *