Main Menu

శ‌బ‌రిమ‌లైలో మ‌హిళ‌ల గురించి బీజేపీ ఎంపీ ఆస‌క్తిక‌ర స్పంద‌న‌

Spread the love

బీజేపీ ఎంపీ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. శ‌బ‌రిమ‌లై వివాదంలో చ‌ర్చ‌నీయాంశంగా వ్యాఖ్య‌లు చేశారు. అయ్యప్ప ఆలయంలో మహిళలను అనుమతించడాన్ని స‌మ‌ర్థించారు. అది మంచి నిర్ణయమని బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్ పేర్కొని కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు. కేర‌ళ‌లో బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌లు చేస్తూ, మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతుండ‌గా, ఈ ఎంపీ మాత్రం భిన్నంగా స్పందించ‌డం విశేషంగా మారింది. వ్యూహాత్మ‌కంగా ఆపార్టీలో త‌లో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను దూరం కాకుండా చూసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

లింగ స‌మాన‌త్వం సాధించే దిశగా ఇది ముందడుగు వంటిదని ఉదిత్ రాజ్ అన్నారు. పరిసంఘ్‌ చైర్మన్‌గా తాను వ్యక్తిగత హోదాలో అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

పురుషుడి పుట్టుకకు మూలమైన స్ర్తీ అపవిత్రురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. భగవంతుడు సర్వాంతర్యామి అంటే ఆలయం వెలుపలా దేవుడు ఉంటాడని, రాజ్యాంగం దృష్టిలో మహిళలు, పురుషులూ సమానమేనని ఉదిత్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. సంప్రదాయాలు కాలానుగుణంగా మారుతాయని, గతంలో బాల్య వివాహాలు, సతీసహగమనం సైతం దేశంలో సంప్రదాయాలుగా ఉండేవని తదనంతరం మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. కాగా, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్యకు ఉదిత్‌ రాజ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.






Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *