బీజేపీకి వరుస ఓటములు

bjp
Spread the love

బీజేపీకి వరుస ఎదురదెబ్బలు తగులుతున్నాయి. అన్ని చోట్లా ఆశాభంగం అవుతుంది. ఇప్పటికే విద్యార్థి సంఘం ఎన్నికల్లో కాషాయి కూటమి పరాజయాలు మూటగట్టుకుంటోంది. కేరళ నుంచి అసోం వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ విభాగం ఓటమి పాలయ్యింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మరో ఓటమి చవిచూసింది.

ఇక వాటికితోడుగా హర్యానాలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోగా ఇప్పుడు రాజస్తాన్ లో ఆపార్టీకి పరాజయం ఎదురయ్యింది. త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందస్తు వ్యూహరచన చేస్తున్న బీజేపీకి ఇది పెద్దదెబ్బగానే భావిస్తున్నారు. . రాజస్థాన్‌లోని పంచాయతీ ఉపఎన్నికల్లో బీజేపీ కుదేలైంది. ఇటీవల జరిగిన ఈ ఉపఎన్నికల్లో 26 స్థానాలకు గాను బీజేపీ కేవలం 12 స్థానాలే గెలుచుకుంది. కాంగ్రెస్ సైతం పోటాపోటీగా 12 స్థానాలు గెలుచుకోగా, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. మరో సీటు ఫలితం వెల్లడికావాల్సి ఉంది. ఆసక్తికరంగా చారిత్రాత్మకంగా బీజేపీకి కంచుకోటైన ప్రాంతాల్లోనే ఈ ఉపఎన్నికలు జరిగాయి. అయితే నిరాశజనకంగా ఫలితాలు రావడం ముఖ్యమంత్రి వసుంధరా రాజేను ఇరకాటంలో పడేసిందని అంటున్నారు.

ఇటీవల రాజస్తాన్ లో రైతు ఉద్యమాల ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రభుత్వమే దిగి రావాల్సి వచ్చింది. అయినా రైతుల్లో నెలకొన్న అసంత్రుప్తి ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటం అయినట్టు కనిపిస్తోంది. ఇదే కొనసాగితే కమలదళం ఆశలు రానున్న రోజుల్లో మరింతగా క్షీణిస్తాయనే అంచనాలు పెరుగుతున్నాయి.






Related News

SC Justices

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the loveసుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలోRead More

bhima-koregaon-latest

బరితెగించి దాడులు

Spread the loveదేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యంRead More

  • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
  • బీజేపీ ఎంపీకి జైలుశిక్ష
  • కోర్ట్ పై కాషాయ జెండా
  • మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!
  • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
  • మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
  • ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు
  • రాహుల్ సొంతగూటిలో కమల వికాసం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *