Main Menu

మోడీ మళ్లీ గెలుస్తారా?: పీకే ఏమన్నారంటే!

Spread the love

దేశంలో ఎన్నికల ఫలితాలపై సర్వే బ్రుందాలకు ప్రాధాన్యత పెరగింది. గడిచిన ఎన్నికల్లో మోడీ విజయానికి ప్రశాంత్ కిషోర్ చేసిన క్రుషి కూడా బాగా తోడ్పడిందన్నది అందరికీ తెలిసిన విషయం. అయితే వచ్చే 2019 ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి. మోడీ భవితవ్యం గురించి ప్రస్తుతం జేడీయూలో చేరిన పీకే కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. జేడీయూ ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం కూడా కావడం విశేషం. మోడీ మిత్రపక్ష నేతగా ప్రశాంత్ కిషోర్ జోస్యం బీజేపీ శ్రేణులకు మింగుడుపడకుండా తయారయ్యింది.

దేశంలో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీయే జనాదరణ కలిగిన నాయకుడని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అయినప్పటికీ 2014 లోక్‌సభ ఎన్నికల స్థాయి ఫలితాలు పునరావృతం కావడం అసాధ్యమని పీకే తేల్చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 272 సీట్లు రావడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘విపక్షం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? అన్న దానికంటే ఇతర అంశాలే ఎక్కువగా పని చేస్తాయి. దేశంలో 70శాతం ప్రజల దినసరి ఆదాయం వంద రూపాయలు కూడా లేదు. వారు ఎవరికి ఓటేస్తారో తెలియదు. అందుకే దేశంలో ప్రతీ ఎన్నికలూ నాయకులకు షాక్‌ ఇస్తుంటాయి’’ అని చెప్పారు.

తాను బీజేపీ, కాంగ్రె్‌సలతో కూడా కలిసి పని చేశానని, నేటి యువతను రాజకీయాల్లోకి ఆకర్షించడం చాలా కష్టమైన విషయమని చెప్పారు. ప్రస్తుతానికి బీజేపీ ముందుందని కానీ ఎన్నికల్లో ఏదయినా జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో గడిచిన ఎన్నికల్లో 4కోట్ల మంది సోషల్ మీడియాలో ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 40 కోట్లకు చేరిందన్నారు. లక్ష మందితో సభ నిర్వహించడం కన్నా లక్షల మందికి సోషల్ మీడియా ద్వారా చేరువ కావడం ప్రయోజనకరంగా మారిందని పీకే చెప్పారు.






Related News

మోడీకి మూఢిన‌ట్టేనా..!

Spread the loveప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రుRead More

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the loveసెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *