Main Menu

ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!

Spread the love

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీకి మొద‌టి సారి ప‌రీక్ష మొద‌ల‌య్యింది. సుదీర్ఘ‌కాలం సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ ఎన్న‌డూ ఇలాంటి స‌వాల్ ఎదుర్కొన్న దాఖ‌లాలు లేవు. ఆయ‌న‌కు స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా దానిని గ‌ట్టెక్క‌డానికి ఆయ‌న చాలా సులువుగానే మార్గాలు అన్వేషించారు. కానీ ప్ర‌స్తుతం దానికి భిన్న‌మైన ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగా కీల‌క‌మైన ఉత్త‌రాదిలో బీజేపీ పునాదుల‌కు పెద్ద దెబ్బ ప‌డుతోంది. సొంతంగా బ‌లం సాధించామ‌నే సంబ‌రంలో మూడేళ్ల పాటు చెల‌రేగిపోయిన మోడీకి నాలుగో ఏట ఆరంభం నుంచి అవ‌స్థ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఐదో ఏట అడుగుపెడుతున్న స‌మ‌యంలో అవి మ‌రింత ముదిరిపోయాయి. తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. కుర్చీ కింద‌కు నీళ్లు తెస్తాయా అన్న సందేహాలు పెంచుతున్నాయి. చివ‌ర‌కు బీజేపీలోనే ప‌లువురు స్వ‌రం పెంచే ప‌రిస్థితిని తీసుకొస్తున్నాయి.

ఎన్డీయే ప్ర‌భుత్వానికి సార‌ధిగా మూడేళ్ల పాటు మోడీ ఎక్కువ కాలం విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో గ‌డిపేశారు. ప్ర‌చారంతో హోరెత్తించారు. ప‌లువురు ఆయ‌న‌కు వంత పాడారు. కానీ తీరా నోట్ల‌ర‌ద్దుకు ముందు..ఆ త‌ర్వాత అన్న‌ట్లుగా రాజ‌కీయాలు మారిపోయాయి. ఒక్క నిర్ణ‌యం ఆయ‌న ఉనికికే ముప్పు తెచ్చిపెట్టేలా ఉంద‌నే వారు త‌యార‌వుతున్నాయి. నోట్ల ర‌ద్దు త‌ర్వాత గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బొటాబోటీగా గ‌ట్టెక్కినా, యూపీలో బంప‌ర్ మెజార్టీ సాధించినా అవ‌న్నీ ఆయా రాష్ట్రాల‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఇచ్చిన తీర్పుగా భావించాలి. కానీ ఆ నిర్ణ‌యానికి బాధ్యుడిగా మోడీకి ఎన్ని మార్కులు వేస్తార‌న్న‌ది జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లోనే తేల‌బోతోంది. అదే ఇప్పుడు బీజేపీకి త‌ల‌నొప్పిగా మారింది.

ప్ర‌జ‌ల్లో బీజేపీ ప‌లుచ‌న అవుతోంద‌నే ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో బీజేపీలో అస‌మ్మ‌తి స్వ‌రాలు పెరుగుతున్నాయి. వాస్త‌వానికి మోడీ పీఠం ఎక్కిన నాటి నుంచి అద్వానీ, ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీ వంటి వారు అసమ్మ‌తిగానే ఉన్నారు. య‌శ్వంత్ సిన్హా, శ‌తృఘ్ను సిన్హా వంటి వారు బ‌హిరంగంగానే వ్య‌తిరేక స్వ‌రం వినిపించారు. కానీ తాజాగా మారుతున్న ప‌రిణామాల్లో ప‌లువురు యూపీ ఎంపీలు అటు యోగీని, ఇటు మోడీని త‌ప్పుబ‌డుతున్నారు. గోర‌ఖ్ పూర్ ఫ‌లితాల త‌ర్వాత ఎదురుదాడి చేస్తున్నారు. అదే స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షాలు కూడా జారిపోతున్నాయి. శివ‌సేన‌, టీడీపీ దారిలో అకాలీద‌ళ్ న‌డుస్తుంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

అన్నింటికీ మించి క‌ర్ణాటక ఎన్నిక‌ల్లో క‌మ‌లానికి క‌ష్ట‌కాలం దాపురించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏడాది క్రితం ఆపార్టీ మంచి ఊపు మీదుంది. కాంగ్రెస్ ని ఓడించ‌డం ఖాయం అన్న‌ట్టుగా క‌నిపించింది. కానీ తీరా గ‌డిచిన కొన్నాళ్లుగా సిద్ధూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వ విధానాల ప‌ర్య‌వ‌సానంగా ప‌డిపోయిన మోడీ గ్రాఫ్ తో విల‌విల్లాడుతోంది. చివ‌ర‌కు అనేక చోట్ల మూడోస్థానంలో మిగిలిపోతుంద‌నే అంచ‌నాలున్నాయి. దానికి ప‌రాకాష్ట‌గా మోడీ ప్ర‌చారానికి దూరంగా ఉంటున్నారు. రాహుల్ దూసుకుపోతుండ‌గా, మోడీ దానికి భిన్నంగా సాగ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం, పార్ల‌మెంట్ న‌డ‌ప‌లేక‌పోవ‌డం వంటి వైఫ‌ల్యాల‌కు తోడు ఎస్సీ ఎస్టీ చ‌ట్టం స‌హా అనేక ప‌రిణామాలు బీజేపీకి త‌ల‌నొప్పిగా మారాయి. వీట‌న్నింటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో అర్థం కాని మోడీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే స్వ‌యంగా ప్ర‌ధాని ఒక‌రోజు దీక్ష‌కు దిగ‌డం ఆశ్చ‌ర్యంగా మారింది. మోడీకి సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచి ఇలాంటి దీక్ష‌ల‌తో జ‌నాల‌ను ప‌క్క‌దారి పట్టించే ప్ర‌య‌త్నం చేయ‌డం అల‌వాటు. అందుకు కొన‌సాగింపుగానే గాంధీన‌గ‌ర్ నుంచి హ‌స్తిన‌కు వ‌చ్చినా అవే ఎత్తుగ‌డ‌లు అవ‌లంభిస్తున్నార‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.


Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *