కేరళలో చేతులు కాల్చుకున్నదెవరు?

pinarayishah759
Spread the love

కేరళ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. అన్నింటికీ మించి నూరుశాతం అక్షరాస్యతతో , రాజకీయ అవగాహనతో , సైద్దాంతిక చర్చలతో సాగడం మళయాళీల నైజం. అలాంటి చోట రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే చాలా నేర్పు అవసరం. అందులోనూ రెండు కూటముల మధ్య విడిపోయిన రాష్ట్రంలో మూడో శక్తి ఎదగాలంటే చాలా శ్రమించాలి. కానీ కమలనాథుల దుందుడుకు తనం అసలుకే ఎసరు పెట్టేలా ఉంది. వచ్చిన అవకాశాలను చేజేతులా కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. తాజా పరిణామాలతో ఆ పార్టీ వ్యూహాత్మక తప్పిదాల పరంపర కనిపిస్తోంది. దేశమంతటా దాని ప్రభావం ఖాయంగా కనిపిస్తోంది.

కేరళలో సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వాన యూడీఎఫ్ కూటములు తలో ఒకసారి విజయం సాధిస్తూ వస్తున్నాయి. ప్రతీ ఐదేళ్లకు అధికార మార్పిడి అక్కడ ఆనవాయితీగా మారింది. అలాంటి చోట ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న ప్రాంతంలో పాగా కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచించడంలో భాగంగా మిత్రపక్షాల కోసం ప్రయత్నించింది. కానీ తగిన చేయూత దక్కలేదు. అదే సమయంలో నంబూద్రిలకు వ్యతిరేకంగా ఉండే ఎజ్వాన్ల మద్ధతు దక్కింది. బీడీజేఎస్ మద్ధతుతో మొన్నటి ఎన్నికల్లో 15శాతం ఓట్లను సాధించగలిగింది. దాంతో బీజేపీ నేతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్, సీపీఎంకి పోటీగా తాము ఎదగాలన్న ఆత్రుత మొదలయ్యింది. అయితే అసలే తగిన తోడు లేక సతమతమవుతున్న సమయంలో ఇప్పుడు ఎజ్వాన్లు కూడా బీజేపీకి దూరమయ్యే ప్రమాదం దాపురించింది. మొన్నటి ఎన్నికల్లో అమాంతంగా బీజేపీ బలం పెరగడానికి తోడ్పడిన వారి మద్ధతు కోల్పోవడం మొదలయ్యింది.

దాంతో జనరక్షా యాత్ర పేరుతో ఆర్ఎస్ఎస్ మీద దాడులకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజశేఖరన్ చేపట్టిన పాదయాత్ర తీవ్ర చర్చకు దారితీసింది. అందులో బీజేపీకి ఉద్దండులుగా భావిస్తున్న అమిత్ షా, ఆదిత్యయోగి కూడా కేరళకు బయలుదేరడంతో దేశమంతా అటువైపు చూసింది. కానీ అనూహ్యంగా జనరక్ష కాదు..జనరాక్షస యాత్రం అంటూ కేరళలోని లెఫ్ట్ శ్రేణులు చేసిన ప్రచారం ఫలించింది. పాదయాత్రకు వ్యతిరేకంగా సాగించిన క్యాంపెయిన్ తో కమల నేతలు కకావికలమయ్యారు. చివరకు పాదయాత్రలో జనం లేక అమిత్ షా ఏదో షాకు చూపించుకుని వెనక్కి రావాల్సి వచ్చింది. యోగి మంత్రం కూడా పలించక బీజేపీ శ్రేణుల్లో నిరాశమిగిలింది. కర్ణాటక నుంచి కూడా కార్యకర్తలను తరలించినా ఆర్ఎస్ఎస్ , బీజేపీ మంత్రాంగం ఫలించలేదు. దాంతో కేరళలో కమలం పదేళ్లు వెనక్కి పోయే ప్రమాదం దాపురించింది.

ఓవైపు కీలకమైన మద్ధతుదారుడు దూరమయిన తరుణంలో బీజేపీ సొంత బలం చూపించుకోలేక నిరాశతో జాతీయ అధ్యక్షుడే వెనుదిరగాల్సి రావడం ఆపార్టీ చేతులు కాల్చుకున్నట్టయ్యింది. దానికి ప్రధాన కారణం సీపీఎం వ్యూహాత్మకంగా వ్యవహరించడమే. అందులో సీపీఎం సీఎం విజయన్ వ్యూహచతురత ఫలించింది. బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసి కేరళలో వారికి చోటు లేదని చాటిచెప్పడానికి దోహద పడింది. అదే క్రమంలో కాంగ్రెస్ కూడా బలహీనమవుతున్న నేపథ్యంలో ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేయాలని ఆశిస్తే..ఇప్పుడు అది కూడా లెప్ట్ కి అదనపు బలంగా మారుతుందా అన్న వాదన మొదలయ్యింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాల బలం మరింత పెరగడానికి ఈపరిణామాలు దోహదం చేస్తాయనే విశ్లేషణ మొదలయ్యింది.

ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానంలో అసహనం పెరుగుతోంది. ఏకంగా ఢిల్లీలో లెఫ్ట్ కి వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. సీపీఎం కార్యాలయం వరకూ అమిత్ షా ర్యాలీ చేయాలని నిర్ణయించడం ఆసక్తిగా మారుతోంది. కేరళ పోలీస్ లెక్కల ప్రకారం 2001 నుంచి 17 వరకూ జరిగిన రాజకీయ హత్యల్లో 85మంది సీపీఎం కార్యకర్తలను ఆర్ఎస్ఎస్ మట్టుపెడితే, సీపీఎం చేతుల్లో 64మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చనిపోయినట్టు స్పష్టంగా ఉంది. అయినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వామపక్షాలు హత్య చేస్తున్నాయంటూ బీజేపీ ప్రచారం చేయడం కేరళలో బూమరాంగ్ అయ్యింది. దేశమంతటా ఉపయోపగడుతుందనే అంచనాలో షా అండ్ కో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సాగుతున్నారు. కానీ ఆశించిన ఫలితం కేరళలోనే దక్కనప్పుడు…కేరళ మీద చేసే ప్రచారం దేశమంతటా ఏమేరకు దక్కుతుందన్నది సందేహమే.


Related News

atm-1495008331

ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?

Spread the loveమ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 50 రోజులు ఆగండి..ఆ త‌ర్వాత ఉరితీసినా ఫ‌ర్వాలేద‌ని ధీమా వ్య‌క్తం చేసిన ప్ర‌ధానRead More

karnataka-elections-illustration-759

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌మంతా ఆస‌క్తిరేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాసులు చాలామంది క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్Read More

 • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
 • క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ
 • బీజేపీలో తిరుగుబాటు: మోడీ మీద గురి!
 • అడ్డంగా బుక్కయిన అమిత్ షా
 • సర్వే: మోడీకి మరో గండం
 • హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్
 • బీజేపీ ఆశ‌ల‌కు గండి..!
 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *