Main Menu

క‌మ‌లం, కాంగ్రెస్ ప‌ని అంతే..!

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో క‌మ‌లం దాదాపుగా కుదేల‌య్యింది. నాలుగేళ్ల క్రితం కాస్త ఉత్సాహంతో క‌ళ‌క‌ళలాడిన వారి క్యాంప్ ఇప్పుడు వెల‌వెల‌బోతోంది. ఒక్కో నాయ‌కుడు దూర‌మ‌వుతున్నారు. సీనియ‌ర్లు జారిపోతున్నారు. పార్టీని ద‌గ్గ‌ర చేర్చుకునే మిత్రులే క‌రువ‌య్యారు. ఒంట‌రిపోరు అనివార్యంగా మార‌డంంతో విజ‌యావ‌కాశాలు లేవ‌ని నిర్థారించుకున్న ఎమ్మెల్యేలు కూడా జెండా మార్చేస్తున్నారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి కామినేని తాను పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎమ్మెల్యే జ‌న‌సేన‌లో చేరిపోతున్నారు. శాస‌న‌స‌భా ప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు టికెట్ క‌న్ఫ‌ర్మ్ కోసం టీడీపీ వెయిటింగ్ లిస్టులో సాగుతున్నారు. పురందేశ్వ‌రి స‌హా ప‌లువురు వైసీపీలో చేర‌డం దాదాపు ఖాయంగానే ఉంది. ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీ చేయ‌లేమ‌ని పార్టీ నేత‌ల‌కు చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నికల్లో క‌మ‌లం బోణీ కొట్ట‌డం దాదాపు అసాధ్యంగా మారింది. అదే స‌మ‌యంలో మ‌రో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆశ‌లు కూడా నీరుగారిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్న త‌ర్వాత ఈసారి కోలుకుంటామ‌ని గంపెడాశ‌తో ఆపార్టీ నేత‌లున్నారు. టీడీపీతో పొత్తు తెలంగాణాలో త‌మ‌కు త‌ల‌నొప్పిగా మారిన‌ప్ప‌టికీ దాని న‌ష్ట‌ప‌రిహారం ఏపీలో ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నారు. కానీ చంద్ర‌బాబు మాత్రం దానికి భిన్నంగా కాంగ్రెస్ ని క‌లుపుకుంటే ఆపార్టీ ఓట్లు త‌న మీద వ్య‌తిరేక‌త‌తో వైసీపీ వైపు మ‌ళ్లే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ ఒంట‌రిగా బ‌రిలో దిగితే వైసీపీ ఓట్లు కూడా కొన్ని కాంగ్రెస్ చీల్చే అవ‌కాశం వ‌స్తుంద‌ని లెక్క‌లేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో పొత్తుల‌కు దూరంగా కాంగ్రెస్ ని విడిగా పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు కోరిన‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఏపీ నేత‌ల‌కు రాహుల్ గాంధీ నుంచి అలాంటి స‌మాచారం వ‌చ్చింద‌ని, కానీ కొంద‌రు నేత‌లు మాత్రం టీడీపీతో క‌లిసి వెళ్ల‌డం ద్వారా క‌నీసం ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ కూడా ఏమీ చేయ‌లేని స్థితిలో ఉన్నార‌ని అంచ‌నాలేస్తున్నారు. చంద్ర‌బాబు ద‌యాద‌క్షిణ్యాల‌పై ఏపీలో ఆపార్టీ మారిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ త‌రుణంలో చంద్ర‌బాబు చివ‌రి నిమిషంలో అంచ‌నాలు మార్చుకుంటే త‌ప్ప కాంగ్రెస్ కి కూడా ఒంట‌రి పోరు అనివార్యం అవుతుంది. అదే జ‌రిగితే ఏపీలో క‌మ‌లం మాదిరిగానే కాంగ్రెస్ కూడా కుదేల‌వుతుంద‌ని ఖాయంగా చెప్ప‌వ‌చ్చు. క‌నీసం బోణీ కొట్టే మార్గం త‌ర్వాత ఉన్న నేత‌లు ఎంద‌రు మిగులుతారో కూడా చెప్ప‌లేని స్థితికి చేరుతుంద‌ని భావిస్తున్నారు. మొత్తంగా రెండు ప్ర‌ధాన జాతీయ పార్టీలు ఏపీ ప్ర‌జ‌లకు దాదాపుగా దూర‌మ‌యిన‌ట్టుగా క‌నిపిస్తోంది.






Related News

బాప్-భేటా అవినీతికి ముగింపు త‌ప్ప‌దు..!

Spread the loveఏపీలో అత్యంత చ‌ర్చ‌నీయాంశంగా మారిన న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా సాగింది. అనుకున్న‌ట్టుగానే మోడీ చంద్ర‌బాబు మీదRead More

మోడీ మీన ఎక్కువ ఆశ‌లు పెట్టుకోమాకు..!

Spread the loveమ‌ళ్లీ వ‌త్తున్నాడు గానీ మ‌న‌కు ఏటో చేత్తాడ‌నుకోకు. అత‌డొత్తాడు..వెళ‌తాడంతే. మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆయ‌న మాట ఏమీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *