బీజేపీలో మంటరాజేసిన హార్థిక్

hardik-patel-at-kisan-pratinidhi-panchyat_d2e5200a-dc0d-11e6-84f6-f9b2ee092ea6
Spread the love

చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా మొన్నటి ఎన్నికల్లో గట్టెక్కిన బీజేపీకి అప్పుడే కష్టాలు మొదలవుతున్నాయి. తగిన ప్రాధాన్యం దక్కలేదంటూ డిప్యూటీ సీఎం అలకపాన్పు ఎక్కడం కలకలం రేపుతోంది. కొత్త సమస్యలకు కారణం అవుతోంది. అదే సమయంలో హార్థిక్ పటేల్ ఆఫర్ తో నితిన్ పటేల్ ఎక్కడ టెంప్ట్ అవుతారోననే బెంగ బీజేపీ నేతల్లో మొదలయ్యింది. గుజరాత్ రాజకీయాలను మరోసారి హీటెక్కించింది.

వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అత్తెసరు మెజార్టీతో గెలిచింది. మెజార్టీకి కేవలం 6 సీట్లు మాత్రమే అదనంగా దక్కించుకుంది. దాంతో నాలుగు సీట్లు అలూ ఇటూ అయితే పరిణామాల్లో పెద్ద మార్పులే ఉండవచ్చు. దాంతో డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విజయ్ రూపానీ క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ తనకు తగిన గుర్తింపు రాలేదని వాపోతున్నారు. శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ ఆగ్రహంతో బాధ్యతల స్వీకరణకు దూరంగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం జరిగిన నాలుగు రోజులయినా ఆయన కోపం చల్లారలేదు,

సరిగ్గా అదే సమయంలో హార్థిక్ పటేల్ సంచలన ప్రకటన చేశారు. నితిన్ తనతో కలిసి వస్తే కాంగ్రెస్ తో మాట్లాడి తగిన స్థానం కేటాయిస్తానంటూ ప్రకటించారు. దాంతో పటేళ్లకు సీఎం పీఠం కేటాయిస్తాననే రీతిలో హార్థిక్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. బీజేపీ నేతలు సర్థుబాటు చర్యలకు పావులు కదుపుతున్నారు. మరి పరిణామాలు ఎటు మళ్లుతాయోననే చర్చ మాత్రం మొదలయ్యింది. ఓటమి తర్వాత కూడా హర్థిక్ కమలనాథులను వెంటాడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో మొదలయ్యింది.


Related News

parliament211

హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్

Spread the loveకాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బీజేపీని ఇర‌కాటంలో నెట్ట‌డానికి కదులుతోంది. అందులో భాగంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం పేరుతోRead More

bjp congress

బీజేపీ ఆశ‌ల‌కు గండి..!

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు క‌ద‌న‌రంగం సిద్ద‌మవుతోంది. కానీ క‌మ‌ల‌ద‌ళానికి రానురాను క‌ష్టాలు త‌ప్ప‌వ‌నిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో మ‌స‌క‌బారుతున్నRead More

 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • శ్రీదేవి మ‌ర‌ణానికి కార‌ణం అది కాదు…
 • నీర‌వ్ మోడీ బీజేపీకి పార్ట‌న‌ర్
 • ఆ పాటకు మద్ధతుగా సీఎం
 • సీఎం ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం
 • మాజీ సీఎం కులం మార్చేసిన మోడీ
 • మోదీ మత్తులో ఉన్నప్పుడు…
 • ఆంధ్రప్రదేశ్ ఆశలపై నీళ్లు జల్లిన మోడీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *