సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం: రాజీనామా స‌మ‌ర్ప‌ణ‌

nitish-kumar_650x400_41484897953
Spread the love

బీహార్ రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపు తిరిగాయి. ఏకంగా సీఎం రాజీనామా చేశారు. నితీష్ కుమార్ త‌న రాజీనామాను గ‌వ‌ర్న‌ర్ కి స‌మ‌ర్పించారు. దాంతో జేడీయూ, ఆర్జేడీ ప్ర‌భుత్వ పాల‌న‌కు ముగింపు ప‌లికిన‌ట్టే భావించాలి. చాలాకాలంగా ఆర్జేడీకి దూరంగా ఉంటున్న నితీష్ అనూహ్యంగా తీసుకున్న నిర్ణ‌యంతో లాలూ పార్టీ ఇర‌కాటంలో ప‌డింది. జేడీయూ ఎల్పీ స‌మావేశంలో త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన నితీష్ కుమార్ రాజీనామా స‌మ‌ర్పించ‌డంతో కొత్త కూట‌మి ప్ర‌భుత్వానికి రంగం సిద్ధ‌మ‌యిన‌ట్టుగా భావించ‌వ‌చ్చు. ఇన్ఛార్జ్ గ‌వ‌ర్న‌ర్ త్రిపాఠీకి ఆయ‌న రాజీనామా ప‌త్రం స‌మ‌ర్పించారు. బీజేపీతో జ‌త‌గ‌ట్టి, కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కోసం నితీష్ కుమార్ ఏర్పాట్లు చేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

బీహార్ లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీని ఖంగుతినిపించిన మ‌హా కూట‌మి పాల‌న‌కు ఏడాదిలోనే ముగింపు ప‌డింది. లాలూ కుటుంబంపై వ‌రుస‌గా సీబీఐ, ఐడీ కేసుల నేప‌థ్యంలో మంట మొద‌ల‌య్యింది. డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్ రాజీనామా చేసి త‌న నిజాయితీ నిరూపించుకోవాల‌ని సీఎం చేసిన సూచ‌న‌ను ఆయ‌న లాలూ త‌న‌యుడు బేఖాత‌రు చేశారు. త‌న మీద చేస్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదంటూ ఆయ‌న రాజీనామాకి స‌సేమీరా అన్నారు. దాంతో కాంగ్రెస్, ఆర్జేడీల‌తో త‌మ‌కు సంబంధం లేదంటూ నితీష్ రాజీనామా స‌మ‌ర్పించారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత నితీష్ ని అంతా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పీఎం రేసులో ఉంటార‌ని భావించాలి. మోడీని ఖంగుతినిపించిన నేత‌గా భావించారు. కానీ ఆత‌ర్వాత నోట్ల ర‌ద్దు స‌హా ప‌లు అంశాల్లో మోడీకి తోడుగా నిలిచి ఇప్పుడు ఏకంగా ఆయ‌న‌తో చేతులు క‌ల‌ప‌డానికి సిద్ధ‌మ‌య్యారు. దాంతో బీహార్ రాజ‌కీయాలు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి.


Related News

SC Justices

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the loveసుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలోRead More

bhima-koregaon-latest

బరితెగించి దాడులు

Spread the loveదేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యంRead More

 • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
 • బీజేపీ ఎంపీకి జైలుశిక్ష
 • కోర్ట్ పై కాషాయ జెండా
 • మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
 • ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు
 • రాహుల్ సొంతగూటిలో కమల వికాసం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *