రాహుల్ గాంధీపై రాళ్లదాడి

rahul-gandhi-will-be-visiti
Spread the love

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్‌లో చేదు అనుభవం ఎదురైంది. వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి వారికి బాసటగా నిలవాలని రాహుల్ యత్నించగా నల్ల జెండాలతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీకి జై అంటూ భారీ ఎత్తున నినాదాలు చేయడంతో షాకవడం రాహుల్ వంతైంది. అంతటితో ఆగని కొందరు అల్లరిమూకలు ఏకంగా ఆయన కాన్వాయ్‌పై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన బనాస్‌కాంత జిల్లాలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపించారు.

ఇటీవల ఉత్తర గుజరాత్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోగా, 4.5 లక్షల మంది బాధితులుగా మారారు. నష్టపోయిన రైతులను, ఆయా ప్రాంతాల బాధితులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ నేడు గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. జనాస్‌కాంత జిల్లాలోని ధరేనా పట్టణంలో రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. ఆయన రావడంతోనే దారి పోడవునా నల్ల జెండాలతో స్వాగతం పలికారు.
కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్ కాన్వాయ్‌ వెంటపడి రాళ్లదాడికి దిగి వాహనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఓ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. రాళ్లదాడిలో రాహుల్ వాహనం ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ నీరజ్ బద్గుజర్ తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వివరించారు.






Related News

page-41

మోడీకి సినిమా చూపిస్తున్నారు..

Spread the love260Sharesమెర్సల్..ఓ సాధారణ సినిమా. అందులోనూ ప్రాంతీయ భాషలో తీసిన సినిమా. ఆ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగాRead More

kejriwal

ఆమ్ ఆద్మీ కూడా ఆ చెట్టు కొమ్మేనా?

Spread the love6Sharesఇప్పటికే అన్నా హజారేని చూశాం…కిరణ్ బేడీని చూశాం..రామ్ దేవ్ బాబాని, నితీష్ కుమార్ ని కూడా చూశాం.Read More

  • దేశభవిష్యత్ గుజరాత్ చేతిలో..
  • తప్పు అంగీకరించిన కమల్ హాసన్
  • ఆస్తుల్లో కమలం పార్టీకే అగ్రస్థానం
  • బీజేపీని మట్టికరిపిస్తాం…
  • బీజేపీ కోలుకుంటుందా?
  • అమిత్ షా నో చెప్పేశారు..
  • బీజేపీకి షాకిచ్చిన ఆర్ఎస్ఎస్
  • కమలం జయకేతనం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *