Main Menu

బరితెగించి దాడులు

bhima-koregaon-latest
Spread the love

దేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యం రానురాను కనుమరుగవుతూ అందరినీ కలిచివేస్తోంది. దానికి తోడు కులవిద్వేషాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి గుజరాత్ ఎన్నికల్లో కుల సమీకరణాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల నుంచి ఇప్పుడు నడిబజారులో బహిరంగదాడికి కూడా దిగే స్థాయికి చేరిపోయాయి.

మహారాష్ట్రలో భీమ్ కోరేగావ్ లో ప్రతీ ఏటా జనవరి 1న అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమం జరుగుతుంది. పీష్వాలకు వ్యతిరేకంగా మరాట్వాడీలు చేసిన పోరాటానికి నిదర్శనంగా ఆ గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 1928లోనే నాడు అంబేద్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి జరుగుతోంది. అయితే ప్రస్తుతం మారిన పరిణామాల్లో దానిని వ్యతిరేకించే తరగుతులు దాడులకు దిగడం పెను దుమారం రేపింది. ప్రభుత్వం కూడా పట్టపగలే దాడులు జరుగుుతన్నా పట్టించుకోకపోవడం వివాదానికి దారితీస్తోంది.

భీమా కోరెగావ్‌లో దళిత, ఇతర సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం ముగిసి తిరిగి వస్తుందడగా, దారికాచి దాడికి పాల్పడడం వివాదం కలకలం రేపింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతరం మహారాష్ట్రలో ముంబైతో సహా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో 8 జిల్లాల్లో 144 సెక్షన్‌ విధించారు. నిరసన కారులు ముంబైలో రోడ్లపై అడ్డంకులు సృష్టించారు. సుమారు 134 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ న్యాయవిచారణకు ఆదేశించారు. అయితే ఆందోళనకారులు మాత్రం చల్లారలేదు. తాజాగా మహారాష్ట్ర బంద్ కి పిలుపునివ్వడంతో మంటలు చల్లారేలా కనిపించడం లేదు.






Related News

rammadhav

మోడీకి భ‌క్తుడు రాంరాం..

Spread the loveబిజెపికి కీల‌క నేత దూర‌మ‌య్యారు. ఆయ‌న జ‌నంలో ఉండే నాయ‌కుడు కాక‌పోయినా, జ‌నం నాడి క‌నిపెట్టి, బీజేపీRead More

625352-modi-narendra-pti-092217

ముహూర్తం పెట్టేస్తున్న మోడీ

Spread the loveఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా మేం సిద్దం అంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. కేంద్రంలో పెద్ద‌లు కూడా అదే ఆలోచ‌న‌లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *