Main Menu

ఏటీఎంల‌కు ఎందుకీ అగ‌చాట్లు?

Spread the love

దేశంలో నోట్ల‌ర‌ద్దు తాలూకా ప్ర‌భావం కొన‌సాగుతోంది. దేశాన్ని అస్త‌వ్య‌స్తం చేసిన ఆ నిర్ణ‌యం నేటికీ దుష్ప్ర‌భావాలు చూపుతోంది. ఇంకొన్నాళ్ల పాటు ఆ నిర్ణ‌యం మూలంగా ఏర్ప‌డిన నీలినీడ‌లు కొన‌సాగే ప్ర‌మాదం ఉంది. దాని కార‌ణంగానే ఇప్పుడు ఏటీఎంలు మూత‌ప‌డే ప్ర‌మాదం ఏర్ప‌డిన‌ట్టు భావిస్తున్నారు. ఆర్థిక‌రంగంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌కు ఇది తీవ్ర స్థాయిగా క‌నిపిస్తోంది. మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాల‌కు నాందీ వాచ‌నంగా మారుతోంది.

ఇక ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 2 .38 లక్షల ATM లు ఉన్నాయి. మ‌న‌దేశంలో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం 1994 ప్రాంతంలో ఏటీఎంలు ప్ర‌వేశించాయి. తొలినాళ్ల‌లో ఏటీఎం వినియోగించినుంద‌కు ఖాతాదారుల‌పై ప్ర‌తీ లావాదేవీకి గానూ యూజ‌ర్ ఛార్జీలు వ‌సూలు చేసేవారు. ఆ త‌ర్వాత క్ర‌మంగా ప‌రిస్థితులు మారిపోయాయి. ఏటీఎంల నిర్వ‌హ‌ణ‌లో కూడా మార్పు వ‌చ్చింది. ఏసీలు, సెక్యూరిటీ గార్డులు కూడా లేకుండా ఏటీఎంలు న‌డుస్తున్నాయి.

అయిన‌ప్ప‌టికీ న‌గ‌దు నిల్వ చేసే బాధ్య‌త‌ను బ్యాంకుల నుంచి కొన్ని ఏజ‌న్సీల‌కు అప్ప‌గించ‌డం స‌హా ప‌లు కార‌ణాల‌తో ఏటీఎంల నిర్వ‌హ‌ణ భారంగా మారుతోంది. ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం ఒక్కో ఏటీఎం నిర్వ‌హ‌ణ‌కు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌నీసంగా 40 నుంచి 45 వేల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నాలున్నాయి. మెట్రో న‌గ‌రాల్లో అయితే అది స‌గ‌టున 70వేల రూపాయ‌లు అవుతుంద‌ని చెబుతున్నారు. న‌గ‌రాల్లో క్యాష్ ప‌దే ప‌దే నింపాల్సిన ప‌రిస్థితి ఉంది. లేకుంటే తాకిడి పెర‌గ‌డంతో ఏటీఎంలు వెల‌వెల‌బోవాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో నిర్వ‌హ‌ణ పెర‌గ‌డం, ఆదాయం త‌గ్గ‌డం ప్ర‌స్తుతం ఏటీఎంల అగ‌చాట్ల‌కు కార‌ణం అవుతున్నాయి. లావాదేవీలు ప‌రిమితంగా ఉండే ప్రాంతంలో అయితే నిర్వ‌హ‌ణ వ్య‌యం మ‌రింత ఎక్కువ‌గా ఉంటోంది.

ఆదాయం త‌గ్గిపోవ‌డంతో నిర్వ‌హ‌ణ భారం అవుతున్న త‌రుణంలో ఏటీఎంలు మూత‌ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతోందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఏటీఎంలు స‌మ‌స్య‌ల్లో కూరుకుపోవ‌డానికి నిర్ణ‌యాలు తీసుకున్న వాళ్లే, ఇప్పుడు స‌మ‌స్య‌ల్లో ఉన్నాయి కాబ‌ట్టి మూతేస్తున్నామంటూ చెప్ప‌డం విశేషంగా మారింది. అందుకు తోడు బ్యాంకుల విలీనం కార‌ణంగా ప‌క్క ప‌క్క‌నే ఉన్న ఎస్బీఐ, ఎస్బీహెచ్ వంటి ఏటీఎంలు అనివార్యంగా మూత‌ప‌డ‌క త‌ప్ప‌దు.

దాంతో ప్ర‌భుత్వం ఏటీఎంలు కుదించ‌క త‌ప్ప‌ని స్థితికి చేర్చింది. ఏటీఎం కార్డులు తీసుకోవాల‌ని, ప్లాస్టిక్ మ‌నీ పెర‌గాల‌ని, ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు సాగించిన ప్ర‌భుత్వం చివ‌ర‌కు ఏటీఎంల మూత వ‌ర‌కూ తీసుకెళ్ల‌డం విధానాల వైఫ‌ల్యాన్ని చాటుతోంద‌న్న‌ది కాద‌నలేని స‌త్యం. కుక్క‌ను చంప‌డానికి పిచ్చి కుక్క ముద్ర వేసిన‌ట్టుగా తొలుత ఏటీఎంల నిర్వ‌హ‌ణ‌ను గాలికొదిలేసి, నిత్యం ఖాళీగా ఉంచేసి, వినియోగ‌దారులు వాటి వైపు చూడ‌కుండా చేసి ఇప్పుడు ఏకంగా వాటిని మూత‌వేయ‌డానికి నిర్ణ‌యించ‌డం మోడీ విధానాల సారాంశాన్ని చాటుతున్నాయి. ఇక పేటీఎం వంటి కంపెనీల లాభాలు పెంచేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.


Related News

సూప‌ర్ స్టార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Spread the loveసూప‌ర్ స్టార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం విష‌యంలో కీల‌క అడుగులు వేశారు. వ‌చ్చేRead More

బాప్-భేటా అవినీతికి ముగింపు త‌ప్ప‌దు..!

Spread the loveఏపీలో అత్యంత చ‌ర్చ‌నీయాంశంగా మారిన న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా సాగింది. అనుకున్న‌ట్టుగానే మోడీ చంద్ర‌బాబు మీదRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *