Main Menu

మోడీ మీన ఎక్కువ ఆశ‌లు పెట్టుకోమాకు..!

Spread the love

మ‌ళ్లీ వ‌త్తున్నాడు గానీ మ‌న‌కు ఏటో చేత్తాడ‌నుకోకు. అత‌డొత్తాడు..వెళ‌తాడంతే. మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆయ‌న మాట ఏమీ వ‌ల్ల కాదు. ఎందుకంటే ఇక్క‌డున్న‌ది చంద‌ర‌బాబు క‌దా. బాబు అంటే వ‌ళ్లంతా మంటున్నా గానీ మోడీ మాత్రం ముట్టుకోలేడు. మ‌న బాబు అంత ప‌వ‌ర్ ఫుల్లు మ‌రి. ఆయ‌న వెనుకెవ‌రెవ‌రో ఉండ‌బ‌ట్టే మోడీకి బాబు స‌వాల్ చేయ‌గ‌నుగుతున్నాడు. వాళ్ల అదుపుఆజ్ఞ‌ల్లో ఉన్న మోడీకి బాబుని ఎదిరించాలన్న కోరికుండొచ్చు గానీ..అడుగు క‌ష్ట‌మే.

మొన్నా మ‌ధ్య ఆగిపోయాడు గానీ..ఈసారి గుంటూరులో మాత్రం కాలెట్టేత్తాడు. గ‌ట్టిగా మాట్లాడ‌తాడ‌ని, బాబు పేరు చెప్పి బుద్ధి చెప్పుతాడ‌ని పాపం కొంద‌రు పువ్వు పార్టీ వాళ్లు ఆశిత్తున్నారు. అలా ఏమీ జ‌ర‌గ‌దు. బాబు అంటే ప‌డ‌నోళ్లు కొంద‌రు కోరుకోవ‌చ్చు గానీ మోడీ మాత్రం అలాంటి ప‌ని చేయ‌డు. చేయ‌లేడు. అది చంద‌రబాబుకి బానే తెలుసు. అందుకే మోడీ ఇక్క‌డికి వ‌త్తుంటే..బాబు అక్క‌డికి వెళ్తున్నాడు.

అయినా ఇక్క‌డ అడుగుపెట్టిన‌ప్పుడు ఒక‌టి రెండు మాట‌ల‌న‌గ‌లుగుతాడేమో. అంత‌కుమించి చేత‌ల్లో మాత్రం ఏమీ చేయ‌లేడు సుమీ. మాట‌ల‌న‌డ‌మే మాగొప్ప‌గా మ‌నోళ్లు కొంద‌రు మురిసిపోతార‌ని క‌మ‌ల పార్టీ వాల్ల‌కు తెలుసు. అందుకే మోడీతో ఒక‌టి రెండు మాట‌ల‌యినా బాబుని తిట్టించాల‌ని జీవీఎల్ లాంటోళ్లు త‌హ‌త‌హ‌లాడిపోతున్నారు. క‌న్నా లాంటోళ్లు కోరుకుంటున్నారు. పురందేశ్వ‌రి, వీర్రాజు స‌హా అంద‌రూ ఇత ఇదై పోతున్నారు. కానీ మోడీ నుంచి ఎక్కువ ఆశిత్తే ఎగ‌తాళి అయిపోతావంతే.

రైల్వే జోన్ ఇత్తాడ‌ని, మ‌రేటో చేత్తాడ‌ని కూడా కొంద‌రు ఊహిత్తున్నారు. ఊహాల‌కి మోడీ తీరుకి పొంత‌నే ఉండ‌దన్న‌ది మ‌ర‌చిపోకు. ఎన్నిక‌ల‌యినాక మ‌ళ్లీ బాబు త‌న ద‌గ్గ‌ర‌కే రావాల్సిన ప‌రిస్థితి వ‌స్తే సిద్ధంగా ఉంటాడ‌ని మోడీకి తెలియ‌దేటి. అందుకే అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు. ఆచితూచి మాట్లాడ‌తాడు. గో బ్యాక్ మోడీ అంటూ రోడ్డు మీద‌కు వ‌చ్చిన వాళ్ల‌కు ఇంకా దాహం తీర‌క‌ముందే మోడీ వ‌త్తాడు..పోతాడు అంతే. అంత‌కుమించి ఏమీ ఉండ‌దు చూసుకో..ఐదేళ్ల కింద‌టి మాట‌లు మొన్న‌టి పార్ల‌మెంటులో మాట్లాడు గుర్తుందా..ఆ లెక్క‌న ఇప్పుడు కూడా మ‌ళ్లీ పాత పాటే పాడిన పెద్దాగా ఆశ్చర్య‌ప‌డ‌మాకు. అన్నింటికీ సిద్ధంగా ఉండు మ‌రి.






Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *