Main Menu

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the love

ఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలు 20 రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి., ఆ త‌ర్వాత ఏప్రిల్ 18న రెండో విడ‌త లో 97 స్థానాల్లో 18 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 23న మూడో విడ‌త 14 రాష్ట్రాల‌కు చెందిన 115 స్థానాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతోంది. ఏప్రిల్ 29న 9 రాష్ట్రాల‌కు చెందిన 71 స్థానాల‌లో నాలుగో విడ‌త జ‌రుగుతోంది. మే 6న ఐదో విడ‌త‌, మే 12న 59 స్థానాల‌లో 7 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు ఆరో విడ‌త‌, చివ‌రి విడ‌త ఎన్నిక‌లు 19 మే నాడు 8 రాష్ట్రాల‌కు చెందిన 57 స్థానాల‌లోజ‌ర‌గ‌బోతున్నాయి. ఫ‌లితాలు మే 23న విడుద‌ల చేస్తామ‌ని సీఈసీ సునీల్ ఆరోరా వెల్ల‌డించారు.

ఏపీలో ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. త‌మిళ‌నాడు, తెలంగాణా, ఉత్త‌రాఖండ్ స‌హా మొత్తం 22 రాష్ట్రాల‌లో ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. అసోం, చ‌త్తీస్ ఘ‌డ్ ల‌లో మూడు విడ‌త‌లో, జార్ఖండ్, ఒడిశా, మ‌ధ్య‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌ లో నాలుగు విడ‌త‌లుగా, జ‌మ్ము అండ్ క‌శ్మీర్ లో ఐదు విడత‌లుగానూ, యూపీ, బీహార్, బెంగాల్ లో ఏడు విడ‌త‌లుగానూ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బోతున్నారు.

ఏపీ ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌ర‌గ‌బోతున్నాయి. దాంతో ఏపీ వాసులు ఫ‌లితాల కోసం నెల 10 రోజుల పాటు వేచి చూడ‌క త‌ప్ప‌దు. తెలంగాణా, ఏపీలో కూడా ఒకే రోజు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం విశేషంగానే చెప్ప‌వ‌చ్చు.

👉 భారతదేశంలో 2019 ఎన్నికల షెడ్యూల్

1◼ఉత్తరప్రదేశ్ & బీహార్ ➖ఏప్రిల్ 10,17,24,30, మరియు మే 7,12

2 ◼ఒడిశా➖ ఏప్రిల్ 10,17

3◼ జార్ఖండ్ ➖ ఏప్రిల్ 10,17,24

4◼ ఛత్తీస్గడ్➖ ఏప్రిల్ 10,17,24

5◼మద్యప్రదేశ్ ➖ఏప్రిల్ 10,17,24

6◼ హర్యానా➖ ఏప్రిల్ 10

7◼జమ్మూకాశ్మీర్➖ ఏప్రిల్ 10,17,24,30, మరియు మే 7

8◼ కేరళ➖ ఏప్రిల్ 10

9◼ మేఘాలయ్➖ ఏప్రిల్ 9

10◼ మిజోరాం➖ ఏప్రిల్ 9

11◼ నాగాలాండ్➖ ఏప్రిల్ 9

12◼అరుణాచల్ ప్రదేశ్➖ ఏప్రిల్ 9

13◼ మణిపూర్➖ ఏప్రిల్ 9,17

14◼ అస్సాం➖ ఏప్రిల్ 7,12,24

15◼త్రిపుర➖ ఏప్రిల్ 7,10

16◼ పంజాబ్➖ ఏప్రిల్ 10

17◼సిక్కిం ➖ ఏప్రిల్ 12

18◼ కర్ణాటక➖ ఏప్రిల్ 17

19◼గోవా➖ ఏప్రిల్ 17

20 ◼ పశ్చిమబెంగాల్➖ ఏప్రిల్ 17,24,30, మరియు మే
7,12

21◼ రాజస్థాన్➖ ఏప్రిల్ 17,24

22◼ తమిళనాడు➖ ఏప్రిల్ 24

23◼ మహారాష్ట్ర➖ఏప్రిల్ 17,24

24◼ ఆంధ్రప్రదేశ్➖ ఏప్రిల్ 30

25◼ తెలంగాణ➖ ఏప్రిల్ 30

26◼గుజరాత్➖ ఏప్రిల్ 30

27 ◼హిమాచల్ ప్రదేశ్➖మే 17

28◼ ఉత్తరాఖండ్➖ మే 17






Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *