అమాంతంగా పెరిగిన అమిత్ షా ఆస్తులు

railys-of-politician-of-amit-shah-in-bihar-1024x682
Spread the love

బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొంద‌రి ఆస్తులు వేగంగా పెరుగుతున్న‌ట్టు రికార్డులు చెబుతున్నాయి. సంప‌ద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృత‌మ‌వుతున్న విష‌యం గ‌ణాంకాలే చెబుతున్నాయి. 2011 నాటికి టాప్ 10 మంది ఉన్న సంప‌ద 48 శాతంగా ఉంటే ఇప్పుడు అదే 10 మంది వ‌ద్ద మొత్తం దేశ‌సంప‌ద‌లో 57 శాతం పోగుబ‌డింది. అంటే 90 మంది ఆస్తులు కేవ‌లం 43 శాత‌మే కావ‌డం విశేషం.

ఇక అదే రీతిలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఆస్తులు కూడా అమాంతంగానే పెరిగాయి. అమితంగా పెరిగిన షా ఆస్తుల లెక్క‌లు తాజాగా గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న ఎంపీగా పోటీ చేస్తున్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది.అమిత్‌ షా(ఆయన భార్యతో కలిపి) ఆస్తి అయితే ఏకంగా 2012 నుంచి 300 శాతం పైకి ఎగిసినట్టు తేలింది. అమిత్‌షా చరాస్తులు రూ.1.90 కోట్ల నుంచి రూ.19 కోట్లకు పెరిగాయి. అంతేకాక ఆయన స్థిరాస్తులు 2012లో రూ.6.63 కోట్లుంటే, 2017కి వచ్చేసరికి అవి రూ.15.30 కోట్లకు పెరిగినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దాంతో అమిత్ షాకి ఈ కాలంలో పెరిగిన ఆస్తులు గ‌మ‌నిస్తే దాదాపు మూడు రెట్లు ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అమిత్ షా సంబంధీకుల‌కు చెందిన అమిటీ యూనివ‌ర్సిటీ కూడా భూములు కేటాయించిన సంగ‌తి తెలిసిందే.

అంతేకాక స్మృతీ ఇరానీ(ఆమె భర్తతో కలిపి) స్థిర, చరాస్తులు కూడా 2014లో రూ.4.91కోట్లుంటే, 2017కి వచ్చే సరికి అవి 80 శాతం పెరిగి రూ.8.88 కోట్లకు ఎగిశాయి. ఇరానీ ఆస్తులు అంతలా పెరగకపోయినప్పటికీ, ఆమె భర్త జుబిన్‌ ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగినట్టు తెలిసింది. కాగ 2014లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ నుంచి కరెస్పాడెన్స్‌లో బీకామ్‌ పార్ట్‌1 పూర్తిచేసినట్టు తెలిపారు. తర్వాత ఆమె డిగ్రీపై పలు లీగల్‌ కేసులు నడిచాయి. ఈ సారి రాజ్యసభకు సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఆమె మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేయలేదని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


Related News

SC Justices

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the loveసుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలోRead More

bhima-koregaon-latest

బరితెగించి దాడులు

Spread the loveదేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యంRead More

 • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
 • బీజేపీ ఎంపీకి జైలుశిక్ష
 • కోర్ట్ పై కాషాయ జెండా
 • మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
 • ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు
 • రాహుల్ సొంతగూటిలో కమల వికాసం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *