500 నోట్ల ముద్ర‌ణ‌లో అతి పెద్ద స్కామ్!

500 note
Spread the love

దేశవ్యాప్తంగా సంచ‌ల‌న రేపే అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. నోట్ల ర‌ద్దు వెనుక అస‌లు మ‌త‌ల‌బు ఇదేనా అన్న అనుమానం క‌లుగుతోంది. అతి పెద్ద స్కామ్ ఇదేనంటూ మోడీ స‌ర్కార్ మీద విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబాల్ ఈ వ్య‌వ‌హారాన్ని పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించి క‌ల‌క‌లం రేపారు. 500 నోట్ల ముద్ర‌ణ‌లో ఉన్న వైరుధ్యాన్ని వెలుగెత్తి చాటారు. ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టారు. రెండు ర‌కాల నోట్లు చెలామ‌ణీలో ఉన్నాయ‌ని ఆరోపించారు. రెండు సైజులు, రెండు వేర్వేరు డిజైన్ల‌లో ఉన్న ఈ నోట్ల ముద్ర‌ణ వెనుక మ‌త‌ల‌బు ఏమిటని ప్ర‌శ్నించారు. ఆర్బీఐ ముద్రిస్తున్న నోట్ల‌లో చెలామ‌ణీలో ఉన్న రెండు ర‌కాల నోట్ల వెనుక ఈ శ‌తాబ్ద‌పు అతిపెద్ద స్కామ్ ఉంద‌ని క‌పిల్ సిబాల్ పేర్కొన్నారు.

గులామ్ న‌బీ ఆజాద్ కూడా ఈ వ్య‌వ‌హారం మీద మండిప‌డ్డారు. చాలాకాలంగా ఆర్బీఐ ముద్రిస్తున్న నోట్ల‌లో ఎన్న‌డూ ఇలాంటి తేడా క‌నిపించ‌లేద‌న్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకటి పార్టీ కోసం, ఒక‌టి ప్ర‌భుత్వం కోసం రెండు ర‌కాల నోట్ల‌ను ఈ ప్ర‌భుత్వం ముద్రించిన‌ట్టు ఉంద‌ని ఆరోపించారు.

అయితే ఈ వాద‌న‌ను అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. జీర్ అవ‌ర్ ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయ‌న వ్యాఖ్యానించ‌డంతో కాంగ్రెస్ స‌భ్యులు మండిప‌డ్డారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అనంత‌రం క‌పిల్ సిబాల్ మాట్లాడుతూ ప్ర‌భుత్వం నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదేన‌ని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆరుణ్ జైట్లీ మాత్రం ఈ నోట్ల వైరుధ్యం మీద ప‌రిశీల‌న చేయాల్సి ఉంద‌న్నారు. ఆర్థిక శాఖ నిపుణులు కూడా నోట్ల సైజు, డిజైన్ల‌లో తేడాలున్న‌ట్టు అంగీక‌రిస్తున్నారు. కానీ అది పెద్ద సంఖ్య‌లో లేద‌ని చెబుతుండ‌డం విశేషం.

కానీ మొత్తంగా ఈ ప‌రిణామం పెను దుమారం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది. పెద్ద సంఖ్య‌లో నోట్ల‌ను భిన్న‌ర‌కాలుగా ముద్రించడం ద్వారా చ‌ట్టాల ఉల్లంఘ‌నే కాకుండా, మొత్తం వ్య‌వ‌స్థ‌నే దోచుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారా అనే అనుమానం బ‌ల‌ప‌డుతోంది.


Related News

MODI

సర్వే: మోడీకి ఎదురుగాలి!

Spread the loveగుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐదేళ్ల క్రితం మోడీకి అనూహ్యమైన ఆదరణ ఉండేది. ఎప్పుడు ఎన్నికలు జరిగినాRead More

modi

మోడీకి మూడింది…!

Spread the loveబీజేపీలో కలకలం మొదలయ్యింది. కర్ణాటకలో తగిలిన షాక్ కమలాన్ని కకావికలం చేసేలా ఉంది. హస్తినలో బీజేపీ హెడ్Read More

 • ఎడ్యూరప్ప..ఇలా అయ్యిందేందప్పా..?
 • కర్ణాటకలో అలానే జరగాలి…!
 • బీజేపీ గెలిచింది: ‘ఫేక్‌ ‘ సర్వేలో..!
 • మోడీని నమ్మి మోసపోయా…!
 • బీజేపీకి భారంగా మారిన సీఎం
 • ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?
 • క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే
 • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *