Main Menu

ముహూర్తం ముంచుకొస్తోంది..స‌న్నాహాల్లో ఈసీ

Spread the love

2019 లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నది. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరా నేత త్వంలోని కమిషన్‌ నాలుగైదు రోజుల్లో భేటీ కానున్నది. ఈసమావేశంలో ఎన్నికల సామాగ్రి లభ్యత, రవాణ తదితర అంశాల పై చర్చించాక, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. సార్వత్రిక ఎన్నికల క్రతువులో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాల సన్నద్ధత, సరంజామాపై ఈసీ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాల్సి ఉన్నది. అందువల్ల 2019 ఫిబ్రవరి చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశాలున్నట్టు సీఈసీ అధికార వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంట్‌లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నూ ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఈ కారణం వల్ల ఎన్నికల షెడ్యూల్‌ను ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు చేయలేదని ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా ప్రతి ఓటరు వినియోగించుకునేలా వీలుగా అవసరమైన భద్రతా సిబ్బందికి నియామకం గురించి ఆరా తీస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పండుగలు, ఇతర ముఖ్యమైన రోజులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిఉంటుంది. దీని ఆధారంగా అనకూలమైన తేదీల గురించి..ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులతో కూడా ఇప్పటికే ఈసీ సంప్రదింపులు షురూ చేసినట్టు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ 2014 మార్చి 5వ తేదీన విడుదల కాగా, ఎన్నికలు తొమ్మిది విడతలుగా ఏప్రిల్‌ 7- మే 12వ తేదీల మధ్యలో జరిగిన విషయం విదితమే. అయితే ఈసారి అంతకన్నా ముందుగా షెడ్యూల్‌ వచ్చే అవకాశాలున్నట్టు సంకేతాలొస్తున్నాయి.

17 వ లోక్‌సభ ఎన్నికతో పాటు, ఆంధ్రప్రదేశ్‌,అరుణాచల్‌ప్రదేశ్‌,ఒడిషా, సిక్కిం, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి.. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యే ఛాన్స్‌ ఉన్నదని సమాచారం. ఆ మేరకు మొదటి విడత ఎన్నిక ఏప్రిల్‌ 10వ తేదీ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్‌లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్‌ యోచిస్తున్నది. ఈ బడ్జెట్‌ ద్వారా జూన్‌ 30వ తేదీ వరకు దాదాపు మూడు నెలలపాటు ప్రభుత్వ నిర్వహణ వ్యయానికి ఆమోదం లభిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లో వరదలప్రవహిస్తున్న కరెన్సీ కట్టలు, ఇతర కీలకమైన అంశాలపై ఎలాంటి కసరత్తు చేయాలన్న దానిపై సీఈసీలో తర్జనభర్జన మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి.


Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *