అత‌డో కామ‌పిశాచి

rahim-family---2-mos_082617042849
Spread the love

ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ కటకటాలకు వెళ్ళి పక్షం రోజులు కావస్తోంది. ఊచలు లెక్కపెడుతున్న అతడిని పరీక్షిం చేందుకు డాక్టర్ల బృందాన్ని జైలు అధికారులు పిలిపించారు. ఈబృందంలో ఒక మాన సిక వైద్యుడు కూడా ఉన్నారు. ఈ బృందం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించింది. అత డొక కామ పిశాచని రోV్‌ాతక్‌ జైలులో అతడిని పరిశీలించిన బృందంలోని వైద్యుడు ఒకరు తెలిపారు. జైలులో అతడు అసంతృప్తితో, అవిశ్రాంతంగా ఉన్నట్టు చెప్పారు. ‘కామానికి బానిస య్యాడు. శారీరక ఆనందాలకు జైలులో అవకాశం లేకపోవడంతో అతడు మనోవేదనకు గురవుతున్నా డు. సరిగా నిద్రలేక అలసటగా ఉన్నాడు. జైలు గోడలను చూ స్తూ ఉండిపోవడం లాంటి లక్షణాలు దీన్నే సూచిస్తు న్నాయని అన్నారు. విచ్ఛలవిడిగా… జీవితాన్ని అనుభవించిన అతడు ఇప్పుడు జైలు జీవితాన్ని నరకప్రాయంగా భావిస్తున్నాడు’ అని ట్వీట్‌ చేశారు. గుర్మీత్‌ ప్రస్తుత పరిస్థితిని చికిత్స ద్వారా నయం చేయొచ్చని చెప్పారు. ఆలస్యం అయితే అసలుకే మోసం వస్తుందని అభిప్రాయపడ్డారు. మద్యం సేవించకపోవచ్చు. కానీ, ఆయన రెగ్యులర్‌గా ఎనర్జీ డ్రింకులు, సెక్స్‌ టానిక్స్‌ను ప్రత్యేకంగా ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి తెప్పించుకుని అధికంగా వినియోగించినట్టు డాక్టర్‌ వివరించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *