తెలుగు మీడియాలో కొత్త చానెల్

0

తెలుగులో ఇప్ప‌టికే 24గం.ల న్యూస్ చానెళ్ల సంఖ్య పెద్ద‌దిగానే ఉంది. అయిన‌ప్ప‌టికీ కొత్త‌వి పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మ‌రో చానెల్ పురుడు పోసుకునే దిశ‌లో సాగుతోంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన కొంద‌రు ఎన్ ఆర్ ఐ లు క‌లిసి ప్రారంభిస్తున్న అచ‌లా చానెల్ ఆ దిశ‌లో అడుగులు వేస్తోంది.

సంక్రాంతి త‌ర్వాత ఈ చానెల్ వ్య‌వ‌హారాలు ఊపందుకునే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురి నియామ‌కాలు జ‌రిగాయి. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పెద్దిరాజు సార‌ధ్యంలో నియామ‌కాలు సాగుతున్నాయి.గ తంలో వివిధ న్యూస్ చానెళ్ల‌లో ప‌నిచేసిన అనుభ‌వంతో సీనియ‌ర్ల‌ను, స‌మ‌ర్థుల‌ను ఎంపిక చేసేందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్యాకేజీ కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే ఉండ‌డంతో ప‌లువురు మొగ్గు చూపుతున్నారు.

టీఆర్ఎస్ కార్యాల‌యానికి చేరువ‌లో ఈ చానెల్ ఆఫీసు ప్రారంభించారు. ఉగాది నాటికి టీవీ తెర‌మీద ద‌ర్శ‌నం ఇస్తుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే అనేక చానెళ్లు మ‌నుగ‌డ‌కే స‌త‌మ‌తం అవుతున్న ద‌శ‌లో కొత్త చానెల్ ఏర‌కంగా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రం. సిబ్బందికి నెల‌ల త‌ర‌బ‌డి జీతాలు కూడా ఇవ్వ‌కుండా ప‌లు యాజ‌మాన్యాలు వేధిస్తున్న ద‌శ‌లో పెద్ద పెద్ద జీతాల‌తో నియామ‌కాలు జ‌రుపుతున్న అచ‌లా చానెల్ ప్ర‌స్థానం ఏదిశ‌లో ఉంటుంద‌న్న‌ది వేచి చూడాల్సిన అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here