టాప్ లో స‌మంతా, వెనుక‌బ‌డిన పూజాహెగ్డే, ర‌ష్మిక‌

0

పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట్లో అడుగుపెట్టిన త‌ర్వాత కూడా ముదురుభామ హ‌వా త‌గ్గ‌డం లేదు. కుర్ర హీరోయిన్ల‌కు ఏమ‌త్రం తీసిపోకుండా త‌న హ‌వా చాటుతోంది. పూజా హెగ్డే, రష్మికా వంటి వారిని కూడా వెన‌క్కి సమంత త‌న సత్తా చాటుతూనే ఉంది. హీరోయిన్ గా విర‌గ‌దీస్తోంది. త‌న‌లో ఉన్న నట‌నా చాతుర్యంతో మన్ననలందుకుంటోంది.

అదే క్ర‌మంలో తాజాగా సమంత మరో ఘనతను సొంతం చేసుకుంది. హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019లో సమంత తొలి స్థానంలో నిలిచింది. వివిధ రంగాల్లో రాణిస్తున్న నలభై ఏళ్ల లోపు వయసు గల మహిళలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేశారు. దీంట్లో సమంత ఎక్కువ ఓట్లు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది.

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న పూజా హెగ్డే ఐదో స్థానం, రష్మికా మందన్న 9వ స్థానం దక్కించుకున్నారు. అలాగే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మూడో స్థానంలో నిలిచింది. ఇక, ఈ జాబితాలో రకుల్, కాజల్ వరుసగా 7,8 స్థానాల్లో నిలవగా, యాంకర్ శ్రీముఖి 25వ ప్లేస్‌లో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here