జ‌న‌సేన ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసిందా..?

0

స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తులు సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఉంటాయి. ఇక స్థానిక పోరులో అనేక చోట్ల ఆయా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వివిధ పార్టీల‌తో క‌ల‌వ‌డం చాలా స‌హ‌జం. దానికి రాష్ట్ర స్థాయిలో పొత్తులు అవ‌స‌రం లేదు. కానీ జ‌న‌సేన అనూహ్యంగా బీజేపీ వెంట ప‌డింది. ప‌దే ప‌దే హ‌స్తిన వెళ్లి క‌లిసి వ‌చ్చారు. ఆఖ‌రికి విజ‌య‌వాడ‌లో తంతు పూర్తి చేశారు. ప్ర‌స్తుతానికి పొత్తు మాత్ర‌మే అని చెబుతున్న‌ప్ప‌టికీ విలీనం దిశ‌గా అడుగులు ప‌డిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు సుదూరంగా ఉన్న స‌మ‌యంలో క‌ల‌వ‌డం ద్వారా ఇక క‌లిసిపోతున్నామ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌రిచారు. భావ‌జాలం ఒక్క‌టే అని చెప్ప‌డం, బీజేపీ ఏం చేసినా ప‌వ‌న్ మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని అన‌డం గ‌మ‌నిస్తుంటే ఇక అన్న‌య్య దారిలో త‌న పార్టీకి తుది ఘ‌డియ‌లు తీసుకొచ్చేసిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

స‌హ‌జంగా పొత్తు అయినా విలీనం అయినా ఇరువైపులా ప్ర‌యోజ‌నం ఉంటుంది. చివ‌ర‌కు ప్ర‌జారాజ్యం విలీనం ద్వారా చిరంజీవి కేంద్ర స్థాయిలో మంత్రిప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అలాంటి ప్యాకేజీ ఏదీ ద‌క్కిన‌ట్టు బ‌హిరంగంగా క‌నిపించ‌డం లేదు. పైగా బీజేపీకి సంపూర్ణంగా దాసోహం అయ్యేందుకు ఆయ‌న సిద్ధ‌ప‌డ‌డం విశేషంగా మారుతోంది. వాస్త‌వానికి బీజేపీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవ‌స‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల క‌న్నా తెలంగాణా ప్ర‌యోజ‌నాల కోస‌మే ముఖ్యం. ప్ర‌స్తుతం బీజేపీ ఆశ‌ల‌న్నీ తెలంగాణా మీద ఉన్న స‌మ‌యంలో అక్క‌డి వ్య‌వ‌హారాల్లో ప‌వ‌న్ ని ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని బీజేపీ ఆశిస్తోంది.

ప‌వ‌న్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంచ‌నాలు వేస్తోంది. త‌ద్వారా తెలంగాణాలో తాము మ‌రింత బ‌ల‌ప‌డ‌వ‌చ్చ‌ని భావిస్తోంది. కానీ భిన్నంగా ఏపీ రాజ‌కీయాల కోసం ఆశించి ఆఖ‌రికి త‌న పార్టీని వారికి అప్ప‌గించేశారు. ఈ నేప‌థ్యంలో జ‌నసేన ప్ర‌స్థానం ఇక ముగించే స‌మ‌యం వ‌చ్చేసింద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. దాంతో ప‌వ‌న్ పొలిటిక‌ల్ కెరీర్ అర్థాంత‌రంగా తిరుగుతున్న మ‌లుపులే ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here