జ‌గ‌న్, జ‌న‌సేన మ‌ధ్య ముదురుతున్న వైరం!

0

ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన కాస్త దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఓట‌మి త‌ర్వాత కూడా వెన‌కుడు వేయ‌డం లేదు. పార్టీని చ‌క్క‌దిద్దుకునే ప‌ని క‌న్నా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డానికే ప‌వ‌న్ ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. త‌ద్వారా రాజ‌కీయంగా ఆయ‌న సెంట‌ర్ పాయింట్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో నేరుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ప‌దే ప‌దే ఆయ‌న గురిపెడుతున్నారు. నేరుగా జ‌గ‌న్ కి సంబంధించిన కులం, మ‌తం కూడా ప్ర‌స్తావించ‌డం ద్వారా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు తాను దూరంగా ఉంటాన‌ని చెప్పిన ప‌వ‌న్ దానికి పూర్తి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఏపీ రాజ‌కీయాల విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఖ‌రి ఇంకా అస్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ముందు కూడా ఆపార్టీది ఇదే ప‌రిస్థితి. చివ‌రి నిమిషంలో బీఎస్పీ, దానికి ముందు వామ‌ప‌క్షాల‌తో జ‌త‌గ‌ట్టిన‌ప్ప‌టికీ వారితో కూడా స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డానికి ప‌వ‌న్ ప్ర‌య‌త్నించిన దాఖ‌లాలు లేవు. చివ‌ర‌కు ఫ‌లితాలు కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. ఊహించిన దానిక‌న్నా జ‌న‌సేన ఘోర‌ప‌రాజ‌యం పాల‌య్యింది. పార్టీ అధ్య‌క్షుడే రెండు చోట్ల ఓట‌మి పాలుకావ‌డంతో ఆపార్టీకి పెద్ద ఎదురుదెబ్బ‌గా మారింది.

ఈ నేప‌థ్యంలో సొంత‌గూటిని చ‌క్క‌దిద్దుకోవ‌డానికి శ్ర‌ద్ధ పెట్టాల్సిన ప‌వ‌న్ దానికి భిన్నంగా ఎదురుదాడికి పూనుకుంటున్నారు. నేరుగా సీఎం మీద గురిపెడుతున్నారు. ఇసుక స‌మ‌స్య‌పై చేప‌ట్టిన లాంగ్ మార్చ్ లోనూ, తాజాగా రాయ‌ల‌సీమ యాత్ర‌లో కూడా ఆయ‌న తీరు అదే విధంగా ఉంది. దాని ఫ‌లితాలు ఏమేర‌క‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇప్ప‌టికే ఎన్నిక‌లకు ముందు జ‌న‌సేనాని ఇదే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించినా, లాభం ద‌క్క‌లేదు. అయినా త‌న ద‌శ‌, దిశ మార్చుకోకుండా అదే చందంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేష‌మే. ఈ ప‌రిణామాల‌ను వైసీపీ కూడా సహించ‌డం లేదు. నేరుగా జ‌గ‌న్ నుంచి ఆయ‌న క్యాబినెట్ అనుచ‌రులు వ‌ర‌కూ అంద‌రూ ప‌వ‌న్ కి కౌంట‌ర్ ఇచ్చేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ప్ర‌భుత్వాధినేత‌ను విమ‌ర్శిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ రెడ్డి అంటుంటే ప‌వ‌న్ నాయుడు అంటూ పోటీ ప‌డుతున్నారు. ఈ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరేలా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ అండ్ కో తో జ‌న‌సేనాని వైరం తీవ్ర‌మ‌యితే ప‌రిణామాలు ఏదిశ‌లో ఉంటాయ‌న్న‌దే ఆస‌క్తిక‌రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here