జ‌గ‌న్ కి చెక్: ఎన్నిక‌లు మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తాయా?

0

తీసుకురావాల‌ని టీడీపీ ఆశ‌. దానికోసం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఏపీ బీజేపీ కూడా అదే ఆశిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అనుంగు మీడియా బ‌ల‌మైన వాద‌న‌లు చేస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం చేతులు క‌లిపింది. సుప్రీంకోర్టు కి వెళ్లి ఎన్నిక‌ల వాయిదా విష‌యంలో తాను అనుకున్న‌ది సాధించాల‌ని అధికార పార్టీ కోరుకున్న‌ప్ప‌టికీ దానికి భిన్నంగా కేవ‌లం ఎన్నిక‌ల కోడ్ వ‌ర‌కూ మాత్ర‌మే తొల‌గించుకోగ‌లిగారు. కానీ ఇప్పుడు కోడ్ ఎత్తేసిన నేప‌థ్యంలో మ‌ళ్లీ ప్ర‌క్రియ మొద‌టికి వ‌స్తున్న‌ట్టేన‌నే సందేహాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఎస్ ఈ సీ రాసిన లేఖ‌లోని అంశాలు అందుకు ఆధారాలుగా ఉన్నాయి. ఏక‌గ్రీవాల విష‌యంలో జ‌రిగిన ప్ర‌హ‌స‌నాన్ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ప్ర‌స్తావించారు. త‌ద్వారా అవ‌న్నీ ఫాల్స్ అంటున్న ప్ర‌తిప‌క్షాల వాద‌న‌కు బ‌లం చేకూర్చారు. కేంద్ర బ‌ల‌గాలు లేకుండా ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గ‌ద‌ని పేర్కొన్నారు. అది కూడా ప్ర‌తిప‌క్షాల వాద‌నే. ఇలా ఏక‌గ్రీవాల‌ను మ‌ళ్లీ మొద‌టికి తీసుకొచ్చి , కొత్త‌గా ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు పెట్టి, అది కూడా కేంద్ర బ‌ల‌గాల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు.

అదే జ‌రిగితే అధికార పార్టీకి తీవ్ర ఆశాభంగం అవుతుంది. అందుకే దాన్ని నిలువ‌రించాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఏక‌గ్రీవం కాకుండా చేయాల‌నే ల‌క్ష్యంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. బ‌లం లేక‌పోయినా వ‌ర్ల రామ‌య్య‌ను బ‌రిలో దింపి ఎస్సీల‌కు సీట్లు కేటాయించ‌డంలో జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం చూపార‌ని చెబుతున్నారు. కానీ చంద్ర‌బాబు కూడ అంత‌కుమించిన రీతిలో వ‌ర్ల రామ‌య్య లాంటి వారికి అన్యాయం చేసిన విష‌యాన్ని జ‌నం మ‌ర‌చిపోవాల‌ని భావిస్తున్నారు. దాన్ని ప‌క్క‌న పెడితే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ వ్యూహాల‌కు అనుగుణంగా సాగుతున్న ద‌శ‌లో స్థానిక ఎన్నిక‌ల‌ను కూడా తిర‌గ‌దోడే వ్య‌వ‌హారం సాగుతోంది. జ‌గ‌న్ ఎలా స్పందిస్తారా..ఇప్ప‌టికే ఎస్ ఈ సీ స్ప‌ష్టంగా చెప్పిన త‌రుణంలో ఎక్క‌డ ఆగితే అక్క‌డి నుంచి మొద‌లుపెట్టించ‌డానికి ఏ రీతిలో ప్ర‌య‌త్నిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here