చంద్ర‌బాబు కుర్చీ కింద‌కు నీళ్లు!

0

ఏపీలో విప‌క్ష నేత‌కు ఉన్న పద‌వి కూడా పోయేలా క‌నిపిస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత హోదాకి కూడా ఆయ‌న దూర‌మ‌య్యే సంకేతాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. ఇప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. త్వ‌ర‌లో మ‌రో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ‌బోతున్నారు. నీవు నేర్పిన విద్యే నీర‌జాక్ష అన్న‌ట్టుగా బాబు వేసిన బాట‌లోనే వైసీపీ అధినేత న‌డుస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. టీడీపీ నేత‌ల‌కు గాలం వేసి బాబుని మ‌రింత ఇర‌కాటంలో నెట్టే య‌త్నంలో ఉన్నారు.

అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల నాటికే టీడీపీ సీన్ మారిపోతోంద‌నే అంచ‌నాలున్నాయి. ఈ జాబితాలో ప్ర‌కాశం జిల్లా ఎమ్మెల్యేల పేర్లు ప్ర‌బ‌లంగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జిల్లాలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలున్నారు. అంద‌రూ కండువాలు మార్చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అయితే అద్దంకి వ్య‌వ‌హారాల కార‌ణంగా క‌ర‌ణం బ‌ల‌రాం, గొట్టిపాటి ర‌వి మ‌ధ్య ఉన్న విబేధాల‌తో ఒక్క‌రే వైసీపీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే రెండో ఎమ్మెల్యే బీజేపీ వైపు మొగ్గినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు అనే ప్ర‌చారం ఉంది. మొత్తంగా ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలంతా ఊగిస‌లాట‌లో ఉండ‌డంతో జిల్లాలో ఆపార్టీ అడ్ర‌స్ గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదం దాపురించింది.

అదే స‌మ‌యంలో విశాఖ నార్త్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గంటా శ్రీనివాస‌రావు గంట కొట్టేయ‌డం ఖాయం కాగా, ఆయ‌న‌కు తోడుగా మ‌రో ఎమ్మెల్యే స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు చెబుతున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారాల‌న్నీ క‌లిసి చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత హోదాకి ఎస‌రుపెట్టేయ‌డం ఖాయం. 18 మందికి ఒక్క‌రు త‌గ్గినా చంద్రబాబు హోదా పోతుంది. దాంతో దానిని కాపాడుకునే య‌త్నంలో ఇప్పుడు బాబు బ‌లంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం నిల‌బ‌డేలా క‌నిపించ‌డం లేద‌ని పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. చూడాలి మ‌రి ఈ చ‌లికాలం దెబ్బ‌తో చంద్ర‌బాబు ఎలా గ‌ట్టెక్కుతారో..రేపు అసెంబ్లీలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here