గుత్తా జ్వాల సెకండ్ ఇన్నింగ్స్ ఆ హీరోతో..!

0

కోలీవుడ్ హీరోతో గుత్తా జ్వాల జ‌త‌క‌డుతోంది. ఈ బ్యాడ్మింట‌న్ బ్యూటీకి టాలీవుడ్ తో ఇప్ప‌టికే ప‌రిచ‌యం ఉంది. గ‌తంలో నితిన్ తో క‌లిసి ఓ ఐటెమ్ సాంగ్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. బ్యాడ్మింట‌న్ డ‌బుల్స్ స్టార్ గా పేరొందిన గుత్తా జ్వాల గ‌తంలో త‌న స‌మ‌చ‌రుడు చేత‌న‌ను పెళ్లి చేసుకుని విడాకుల‌తో దూరంగా ఉంటోంది.

ఇక ప్ర‌స్తుతం కోలీవుడ్ లో ప‌లు సినిమాల్లో క‌నిపించిన విష్ణు విశాల్ ని వివాహం చేసుకోవ‌డానికి రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల విష్ణు కూడా త‌న భార్య‌కు విడాకులు ఇచ్చారు. దాంతో ఈ ఇద్ద‌రూ పెళ్లి మండ‌పం ఎక్క‌డం ఖాయ‌మ‌ని కొద్దిరోజులుగా సాగుతున్న ప్ర‌చారం న్యూ ఇయ‌ర్ సాక్షిగా వారు విడుద‌ల చేసిన ఫోటోల‌తో ఖరార‌య్యింది.

కొత్త సంవత్సరం సందర్భంగా సెలెబ్రిటీలు పండగ చేసుకుంటున్నారు. పెళ్లికాని సెలెబ్రిటీలు సైతం తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా నటాషాల ప్రేమాయణం కొత్త సంవత్సరం సందర్భంగా వెలుగులోకి వచ్చింది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కూడా తన ప్రేమాయణాన్ని బహిర్గతం చేసింది. ఇటీవ‌లే విష్ణు హీరోగా కొత్త సినిమాకు గౌత‌మ్ మీన‌న్ అంతా సిద్ధం చేసుకున్నారు. ఈలోగా జ్వాల‌తో క్లోజ్ గా ఉన్న ఫోటోల‌తో విశాల్ హాట్ టాపిక్ అయ్యారు.

న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. తమిళ హీరో విష్ణు విశాల్‌తో సన్నిహితంగా దిగిన ఆ ఫోటోలు… వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ వుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నాయి.విశాల్ గుత్తా జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటోను చూసి.. వీరి రిలేష‌న్ ఇక పెళ్లి వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్టేన‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. దాంతో ఈ వ్య‌వ‌హారం అటు స్పోర్ట్స్, ఇటు సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here