క‌రోనా కంట్రోల్ లోనే ఉంది..!

  0

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు అన్ని ర‌కాలుగా అప్ర‌మ‌త్త‌మ‌య్యామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. తాజా ప‌రిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే ఎస్ జ‌వ‌హార్ రెడ్డి బులిటెన్ విడుద‌ల చేశారు. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 బాధితుడు(పాజిటివ్) కోలుకుంటున్నట్టు ప్ర‌క‌టించారు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న బాధితుడిని త్వ‌ర‌లో డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్ ను పరీక్షించి డిస్చార్జ్ చేస్తారని తెలిపారు.

  సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని విజ్ఞ‌ప్తి చేశారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. మాస్కులు , శానిటైజర్ల కొరత రానివ్వబోమ‌ని తెలిపారు. కొవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ, నిత్యం సమీక్షిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని కోరారు. ఏమ‌యినా అనుమానాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని విన్న‌వించారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలన్నారు.

  ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 840 మంది ప్రయాణికుల్ని గుర్తించామ‌న్నారు. 560 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నార‌ని తెలిపారు. 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందన్నారు. అంతేగాకుండా మ‌రో 30 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నట్టు వివ‌రించారు. 92 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 75 మందికి నెగటివ్ వచ్చిందని, మ‌రో 16 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని వివ‌రించారు.

  కొవిడ్-19 ప్రభావిత దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకువ్యాధి లక్షణాలున్నా ,లేకపోయినా ఇళ్లల్లోనే ఉండాలన్నారు. బయటికి వెళ్లవ‌ద్ద‌ని, కుటుంబ సభ్యులతోగానీ , ఇతరులతో గానీ కలవకూడదని సూచించారు. విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో కొవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here