క‌రోనాకి పారాసెట్ మాల్ వాడండి: W.H.O.

0

మీడియా స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌ల మీద విస్తృతంగా ట్రోలింగ్ జ‌రిగింది. క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారు వాడాల్సిన మందుల గురించి సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల మీద ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన సోష‌ల్ మీడియా విభాగాలు విరుచుకుప‌డ్డాయి. అయితే ఇప్పుడు వారంతా ఖంగుతినే రీతిలో అంత‌ర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా బాధితులు సొంత వైద్యంతో చేటు తెచ్చుకోవ‌ద్ద‌ని, ఎటువంటి స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికీ పారా సెట్ మాల్ వాడాల‌ని సూచించింది. దాంతో మ‌రోసారి జ‌గ‌న్ కామెంట్స్ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

క‌రోనా విస్త‌రిస్తున్న కొద్దీ ప్ర‌పంచ‌మంతా వ‌ణుకుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ విరుగుడు లేక‌పోవ‌డంతోనే జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అంతా సూచిస్తున్నారు. అదే స‌మ‌యంలో క‌రోనాకి మందుల కోసం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కానీ ప్ర‌స్తుతానికి ఎటువంటి నిర్ధిష్ట‌మైన మందులు లేక‌పోవ‌డంతో ప్ర‌పంచ‌మంతా ఉప‌శ‌మ‌నం కోసం పారాసెట్ మాల్ వాడాల్సి వ‌స్తోంది. ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి త‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కరోనా గురించి వ‌ర్రీ కావ‌ద్ద‌ని, మెడిసిన్ గా పారా సెట్ మాల్ మాత్రమే ఉంద‌ని తెలిపారు.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్లో ఒక్క పారాసెట్ మాల్ అనే పాయింట్ తీసుకుని విరుచుకుప‌డిన వారంతా విస్తుపోయే రీతిలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిన్న‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ మీద ట్రోలింగ్ కి పాల్ప‌డిన వారంతా ఇప్పుడు విస్తుపోవాల్సి వ‌స్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారు ఐబూప్రోఫెన్ వాడుతున్న‌ట్టు ఓ ప‌రిశోధ‌న‌లో తేలింద‌ని, అది శ్రేయ‌స్క‌రం కాద‌ని తెలిపింది. అదే స‌మ‌యంలో పారాసెట్ మాల్ వాడాల‌ని సూచించింది. వైర‌స్ బారిన ప‌డిన‌వాంద‌రికీ ప్ర‌స్తుతానికి అదే మందుగా తేల్చేసింది. దాంతో జ‌గ‌న్ కామెంట్స్ మీద అవ‌గాహ‌నారాహిత్యంతో వాదించిన వారంతా ఏం మాట్లాడాలో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here