కులం కుంప‌ట్లు రాజేయ‌డం శ్రేయ‌స్క‌ర‌మేనా?

  0

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కులాల ప్ర‌భావం ఈనాటిది కాదు..ఆ ప్ర‌భావం ఇప్ప‌ట్లో త‌గ్గిపోతుంద‌నే విశ్వాసం కూడా జ‌నంలో లేదు. కానీ ఈ కుల ర‌క్క‌సి కోర‌లు మ‌రింత విస్త‌రించేలా వివిధ పార్టీల నేత‌లు వ్య‌వ‌హ‌రించ‌డ‌మే విస్మ‌య‌క‌రంగా మారుతోంది. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం జ‌నం మ‌ధ్య చీలిక‌లు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు ఏపీలో య‌ధేశ్ఛ‌గా సాగుతున్నాయి. ఇటీవ‌ల మ‌రింత విశృంఖ‌లంగా మారుతున్నాయి.

  తాజాగా ఎన్నిక‌ల వాయిదా వ్య‌వ‌హారం కూడా కులం కోణంలోనే అంద‌రూ చూస్తున్న తీరు దానికి అద్దంప‌డుతోంది. ఏకంగా సీఎం నేరుగా ఎన్నిక‌ల అధికారి మీద కులం కోణంలో చేసిన వ్యాఖ్య‌ల‌తో అది మ‌రింత ఊపందుకుంది. ప్ర‌తిప‌క్ష నేత కూడా అదే ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్న త‌రుణంలో ఇరు వైపులా అదే ధోర‌ణి క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఏపీలో రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను ఇత‌రులు కూడా ఆ రెండు ప్ర‌ధాన కులాల మ‌ధ్య వైరంగా భావిస్తుండ‌డం మ‌రో కీల‌కాంశం అవుతోంది.

  సంఖ్య రీత్యా త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ ఆర్థిక‌, రాజ‌కీయ బ‌లంతో సుదీర్ఘ‌కాలంగా సామాజికంగా పై చేయి సాధిస్తున్న రెండు కులాల మ‌ధ్య వైరంగా ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను ప‌లువురు చూస్తున్న తీరు కూడా విస్మ‌య‌క‌ర‌మే చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితులో అస‌లు స‌మ‌స్య‌, వాటికి ప‌రిష్కారాలు అనే దానికి బ‌దులుగా అన్నింటినీ కులం ఆధారంగా చూడాల్సిన ప‌రిస్థితి రావడం ఏపీకి మ‌రిన్ని స‌మ‌స్య‌లు సృష్టించడ‌మే త‌ప్ప పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌లిగించ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి కుల కుతంత్రాలు సాగిస్తున్న వారిని దూరం పెట్ట‌డ‌మే ఏకైక విరుగుడు అనేది జ‌నం గ్ర‌హిస్తే త‌ప్ప ఆంధ్రాలో కులాల కుంప‌ట్లు రాజేసే య‌త్నాలు ఆగ‌వ‌ని చెప్ప‌వ‌చ్చు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here