ఒలింపిక్స్ క‌ష్ట‌మేనా?

0

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసి) సందిగ్ధంలో ప‌డింది. ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ పెద్ద స‌మ‌స్య‌గా మారుతున్న స‌మ‌యంలో ముందుకా వెన‌క్కా అన్న‌ది నిర్ణ‌యించుకోలేక స‌త‌మ‌తం అవుతోంది. ఒక‌సారి వాయిదా వేస్తే ఆ త‌ర్వాత నిర్వ‌హించ‌డం సాధ్య‌మేనా అనే ప్ర‌శ్న వేధిస్తోంది. దాంతో వాయిదాపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆస్ట్రేలియా ఒలింపిక్స్‌ కమిటీ అధ్యక్షులు జాన్‌ కోట్స్‌ తెలిపారు.

వేసవి క్రీడల వాయిదా, ఇతరత్రా వాటిపై ఐఓసి డెడ్‌లైన్‌ ఏమీ పెట్టలేద‌ని ఐఓసి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కారణంగా అన్ని క్రీడలు వాయిదాపడినా.. ఒలింపిక్స్‌ జరగడానికి ఇంకా నాలుగు నెలలు సమయముందని, వాయిదా వేయ‌డం క‌న్నా నిర్వ‌హించాల‌నే సంక‌ల్పంతో క‌మిటీ క‌నిపిస్తోంది. కానీ ప‌రిస్థితులు సానుకూలంగా లేక‌పోవ‌డం స‌మ‌స్య అవుతోంది.

షెడ్యూల్‌ ప్రకారం ఒలింపిక్స్‌ జులై 24 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్ప‌టికి వైర‌స్ ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న‌ది ఊహ‌కంద‌ని విష‌యంగా మారింది. ఒక‌వేళ నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మ‌యితే మాత్రం ఈసారి ఒలింపిక్ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేన‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here