ఐసీసీ టీమ్ సార‌ధిగా కోహ్లీ

0

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక టెస్ట్ జ‌ట్టుని ప్ర‌క‌టించింది. గ‌త ద‌శాబ్ద‌కాలంగా చూపించిన ప్ర‌తిభ ఆధారంగా 11 మంది స‌భ్యుల జట్టుని ఎంపిక చేసింది. జ‌ట్టు సార‌ధిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్ర‌క‌టించింది. జ‌ట్టులో టీమిండియాకు చెందిన స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కి కూడా స్థానం ద‌క్కింది.

ఇక ఓపెనర్లుగా ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్, ఆసీస్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్న‌ర్ ల‌ను ఎంపిక చేశారు. వారితో పాటుగా కివీస్ కెప్టెన్ కేన్ విల‌య‌మ్స‌న్, ఆసీస్ స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ కి కూడా జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఇటీవ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఇంగ్లాండ్ జ‌ట్టుని నిల‌ప‌డంలో కీల‌క భూమిక పోషించిన బెన్ స్టోక్స్ కి ఆల్ రౌండ‌ర్ కోటాలో చోటు ద‌క్కింది. ఇటీవ‌ల రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్ మేన్ ఏబీ డివిలియ‌ర్స్ ని వికెట్ కీప‌ర్ కం బ్యాట్స్ మెన్ గా నిర్ణ‌యించింది.

బౌల‌ర్ల లిస్టులో అశ్విన్ తో పాటు డేల్ స్టెయిన్, జేమ్స్ అండ‌ర్సన్ లో పేస్ బౌల‌ర్లుగానూ, రంగ‌నా హెరాత్ (శ్రీలంక‌)ని స్పిన్న‌ర్ గానూ జ‌ట్టుని ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ప్ర‌క‌టించిన జ‌ట్టు, రికీ పాంటింగ్ ప్ర‌క‌టించిన జ‌ట్టుకి కూడా కోహ్లీనే కెప్టెన్ గా ఎంపిక చేయ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here