ఏబీవీ కేసులో జ‌గ‌న్ స‌ర్కారుకి గుడ్ న్యూస్

0

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర రావుకి చుక్కెదుర‌య్యింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి ట్రిబ్యూన‌ల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. స‌స్ఫెన్ష‌న్ ను స‌మ‌ర్థించింది. దాంతో ఈ మాజీ ఇంటిలిజెన్స్ అధికారికి దారుల‌న్నీ మూత‌ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది.

సొంత కుమారుడి కంపెనీ కోసం దేశ భ‌ద్రత వ్య‌వ‌హారాల్లో ఐపీఎస్ అధికారిగా నిబంధ‌న‌లకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు మీద అభియోగాలు న‌మోద‌య్యాయి. గ‌త నెల‌లో ఆయ‌న్ని స‌స్ఫెండ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దాంతో ఆయ‌న క్యాట్ ని ఆశ్ర‌యించారు. స‌స్ఫెన్ష‌న్ ర‌ద్దు చేయాల‌ని కోరారు.

కానీ కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈవిష‌యంలో ఏబీవీ వాద‌న‌ను తోసిపుచ్చింది. తాజాగా తుదితీర్పులో క్యాట్ కూడా స‌స్ఫెన్ష‌న్ ను స‌మ‌ర్థించింది. ఇజ్రాయేల్ కంపెనీ నుంచి డ్రోన్ల కొనుగోళ్లు వ్య‌వ‌హారం జ‌ర‌గిన అక్ర‌మాల‌కు ఆయ‌న బాధ్య‌త వ‌హించాల‌ని తేల్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. దాంతో ఈ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం విచార‌ణ‌కు సిద్ధ‌ప‌డితే మ‌రింత గుట్టు ర‌ట్ట‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here