ఎంఎస్కే త‌ర్వాత చీఫ్ సెల‌క్ట‌ర్ అత‌నే..!

0

భారత క్రికెట్‌ మండలి(బిసిసిఐ) సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌గా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ ఎల్‌ శివరామకృష్ణన్‌ ఎంపిక కానున్నట్లు సమాచారం. ఎమ్మెస్కే ప్రసాద్‌ స్థానంలో తమిళనాడుకు చెందిన శివరామకృష్ణన్‌ను తీసుకొనేందుకు కసరత్తు జరుగుతోంది. దీనికి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చీఫ్‌ సెలెక్టర్‌ రేసులో శివరామకృష్ణన్‌ అందరికంటే ముందున్నారు. ఇటీవల ఎమ్మెస్కే ప్రసాద్‌ పదవీకాలం ముగియడంతో ఈయన పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెస్కేతోపాటు రెండురోజుల క్రితం గగన్‌ ఖోడా కూడా పదవీకాలం ముగియడంతో స్వచ్ఛందంగా వైదొలిగినా… మిగతా ముగ్గురు సభ్యులు జతిన్‌ పరాంజపే, సందీప్‌ సింగ్‌, మరియు దేవాంగ్‌ గాంధి మాత్రం మరో ఏడాది ఆ పదవుల్లో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ రెండు పదవులను భర్తీ చేసేందుకు గంగూలీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.


నూతనంగా సెలెక్షన్‌ కమిటీ సభ్యుల పదవీకాలాన్ని ఐదేళ్లు నుంచి నాలుగేళ్లకు కుదించాలని ఆదివారం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాలుగేళ్ల పదవీకాలం కూడా ఎక్కువేనని, మూడేళ్లు ఉంటే సరిపోతుందని బిసిసిఐ అధ్యక్షుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కొత్తగా ఎన్నికయ్యే అభ్యర్థులు టీ20 ప్రపంచకప్‌కు వీరే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మెస్కే ప్రసాద్‌, గగన్‌ ఖోడాలు సెంట్రల్‌ జోన్‌ తరఫున అప్పట్లో ఆ పదవులకు ఎంపికయ్యారు. మిగతా ముగ్గురు సభ్యులైన జతిన్‌ పరాంజపే(వెస్ట్‌), సందీప్‌ సింగ్‌(నార్త్‌) మరియు దేవాంగ్‌ గాంధీ(ఈస్ట్‌) ఆ పదవుల్లో ఉన్నా… వచ్చే ఏడాదితో వీరి పదవీకాలం ముగియనుంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ మరియు ఖోడాలు 2015లో ఆ పదవులకు ఎంపికవ్వగా… మిగతా ముగ్గురు 2016లో ఆ కమిటీ సభ్యులతో జతకట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే స్థానంలో సౌత్‌జోన్‌కు చెందిన లెగ్‌ స్పిన్నర్‌ శివరాకృష్ణన్‌ను ఆ పదవిలో తీసుకొనేందుకు గంగూలీ ఉత్సాహంగా ఉన్నట్లు తెలియ వచ్చింది.

అలాగే దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ను కూడా నూతనంగా ఎన్నికయ్యే కమిటీ తీసుకొనేందుకు గంగూలీ ఉత్సాహంగా ఉన్నారు. వెంగ్‌సర్కార్‌ గతంలో ఒకసారి బిసిసిఐ సభ్యునిగా కొనసాగినా పూర్తికాలం ఆ పదవిలో కొనసాగ లేకపో యారు. ఇక పరాంజపే పదవీ కాలం ముగిసిన అనం తరం ఆయనను కొనసాగించాలా! వద్దా! అనే విష యంపై గంగూలీ, జై మాట్లాడుతూ… అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. క్లాజ్‌ 27ఏ(ఐ) ప్రకారం బిసిసిఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలో తప్పనిసరిగా ఐదుగురు సభ్యులు ఉండాలని నిబంధన ఉంది. ప్రతి జోన్‌నుంచి ఒక్కో అభ్యర్ధి తప్పని సరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఖోడా సెంట్రల్‌ జోన్‌ నుంచి ఉండగా… ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్ఞానేంద్ర పాండే కూడా ఈ జోన్‌ నుంచి బోర్డులో సభ్యులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here