ఆచార్య స‌ర‌స‌న ఆ భామ!

0

క‌రోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ ష‌ట్ డౌన్ అయ్యింది. షూటింగుల‌న్నీ దాదాపుగా నిలిచిపోయాయి. దాంతో స్క్రిప్ట్ వ‌ర్క్, ఇత‌ర ప‌నుల్లో ప‌డ్డారు సినీ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. ఇక మెగాస్టార్ లేటెస్ట్ మువీ ఆచార్య కు సంబంధించి హీరోయిన్ ఎంపిక‌పై యూనిట్ దృష్టి పెట్టింది.

ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న త్రిష కి తొలుత అవ‌కాశం ఇచ్చారు. అయితే ఆమె అనూహ్యంగా త‌ప్పుకోవ‌డంతో మ‌రో భామ కోసం వేట త‌ప్ప‌డం లేదు. ఆ క్ర‌మంలో కాజ‌ల్ స‌హా ప‌లువురు హీరోయిన్ల పేర్లు ప్ర‌స్తావ‌న‌లోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే చివ‌ర‌కు చిరంజీవికి కూడా సై అన‌డంతో సైరాలో గెస్ట్ రోల్ లో క‌నిపించిన అనుష్క‌ని ఖాయం చేసిన‌ట్టు స‌మాచారం.

త్వ‌ర‌లో అనుష్క నిశ్శ‌బ్దం అనే సినిమా చేయ‌బోతోంది. దానికి తోడుగా ఆచార్య‌లో కూడా ఆమె ఖారారయితే మ‌ళ్లీ టాలీవుడ్ లో ఈ స్వీటీ సంద‌డి కనిపించ‌బోతున్న‌ట్టుగా చెప్ప‌వచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here