అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ ‘ఇంటిగుట్టు’ ర‌ట్టు?

0

అల్లు అర్జున్ కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగా కొంత సమయం తీసుకుని త్రివిక్రమ్‌తో అల వైకుంఠపురములో అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి కలయికలో ఇంతకు ముందు ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వచ్చి మంచి విజయాలు సాధించాయి. దీంతో మూడో సారి త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న అల వైకుంఠపురములో.. మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలౌతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ అల వైకుంఠపురములో సినిమా కథకు అలనాటి సీనియర్ ఎన్టీఆర్‌ ‘ఇంటిగుట్టు’ అనే సినిమాకు పోలికలున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ సినిమా కథను త్రివిక్రమ్ ఇప్పటి తరానికి తగ్గట్లుగా మార్చి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం తెలియాలంటే మాత్రం త్రివిక్రమ్‌ స్పందించాల్సిందే. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాలో బన్నికి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో సినీయర్ హిరోయిన్ అందాల టబు నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here