అల్లు అర్జున్ ఆశ నెర‌వేరుతుందా?

0

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఎస్‌.ఎ్‌స.తమన్‌ స్వరకర్త. సంక్రాంతి కానుకగా 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్ర సంగీతోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు. త‌న తండ్రికి పద్మ‌శ్రీ ఇవ్వాలంటూ ఆయ‌న కోరిన తీరు ఆస‌క్తిగా మారింది. చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

అల వైకుంఠాపురం ఆడియో వేడుక‌లో మాట్లాడిన అల్లు అర్జున్ నేను మా నాన్నంత గొప్పగా ఎప్పుడూ కాలేను. ఆయనలో సగం కూడా కాలేను. నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్‌ కలుగుతుంది. మా నాన్నను నేను ప్రేమించినంతగా మరేవరినీ ప్రేమించను. నేను ‘ఆర్య’ సినిమా చేసినప్పుడు అప్పట్లోనే కోటి రూపాయలు సంపాదించుకున్నాను. పెళ్లైన తర్వాత నా భార్యను ఒకటే అడిగాను. నాకు ఎన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటాను అని.

మా నాన్నంటే అంత ఇష్టం. నేను చూసిన వారిలో ది బెస్ట్‌ పర్సన్‌ మా నాన్నే. 45 ఏళ్లుగా ఆయన సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మనిషిలో ప్యూరిటీ లేకపోతే ఇంతకాలం సౌత్‌ ఇండియాలో, ఇండియాలో నంబర్‌ వన్‌ ప్రొడ్యూసర్‌గా ఉండలేరు. మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్నగారికి కూడా పద్మశ్రీ రావాలనే కోరిక నాకు ఉంది. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ఇండస్ర్టీకి ఎంతో సేవ చేసిన ఆయన ఆ అవార్డుకు అర్హుడు’’. అంటూ వ్యాఖ్యానించారు

దాంతో అల్లు అర్జున్ ఆశ నెర‌వేరుతుందా అనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. వాస్త‌వానికి ఆయ‌న కోరిన‌ట్టుగా ప‌ద్మ‌శ్రీ అవార్డ్ ఇవ్వాల్సింది కేంద్ర ప్ర‌భుత్వం. కానీ అందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి సిఫార్సు అవ‌స‌రం. కాబ‌ట్టి ఏపీ నుంచి గానీ తెలంగాణా నుంచి గానీ అలాంటి ప్ర‌తిపాద‌న వెళ్లాల‌ని ఆయ‌న ఆశిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి అటు జ‌గ‌న్, ఇటు కేసీఆర్ క‌నిక‌రిస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here